Bihar Exit Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమాప్తం అయింది. రెండు దశలు పోలింగ్ ముగిసిపోయింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడంతో ఓటర్ మహాశయుడి తీర్పు ఎటువైపు?, అధికార పార్టీకి మళ్లీ పట్టం కట్టాడా?, లేక, విపక్ష మహాఘట్‌బంధన్‌కు కుర్చీ అప్పగించబోతున్నాడా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే, మంగళవారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం, బీహార్‌లో మళ్లీ అధికార ఎన్డీయే కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఈ మేరకు దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చాయి. ఎన్డీయే, ఎంజీబీ (మహాఘట్ బంధన్), జేఎస్పీ (జన్ సురాజ్) లకు ఎన్ని సీట్లు వస్తాయని అంచనాగా ఉందో చూద్దాం.
చాణక్య స్ట్రాటజీస్ – ఎన్డీయే 130-138, ఎంజీబీ 100-108, జేఎస్పీ-0, ఇతరులు 3-8
దైనిక్ భాష్కర్ – ఎన్డీయే 145-160, ఎంజీబీ 73-91, జేఎస్పీ-0-3, ఇతరులు 5-7
డీవీ రీసెర్చ్ – ఎన్డీయే 137, ఎంజీబీ 83-93, జేఎస్పీ 2-4, ఇతరులు 1-8
జేవీసీ- ఎన్డీయే 135-150, ఎంజీబీ 88-103, జేఎస్పీ 0-1, ఇతరులు 3-6
మార్టీజ్- ఎన్డీయే 147-167, ఎంజీబీ 70-90, జేఎస్పీ 0-2, ఇతరులు 2-8
పీ-మార్క్యూ- ఎన్డీయే 142-162, ఎంజీబీ 80-98, జేఎస్పీ 1-4, ఇతరులు 0-3
పీపుల్స్ ఇన్‌సైట్- ఎన్డీయే 133-148, ఎంబీజీ 87-102, జేఎస్పీ 0-2, ఇతరులు 3-6
పీపుల్స్ పల్స్- ఎన్డీయే 133-159, ఎంజీబీ 75-101, జేఎస్పీ 0-5, ఇతరులు 2-8
టీఐఎఫ్ రీసెర్చ్- ఎన్డీయే 145-163, ఎంజీబీ 76-95, జేఎస్పీ -0, ఇతరులు 3-6
ఆర్జేడీకి పెద్ద దెబ్బ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసిన తర్వాత విపక్ష మహాకూటమి పార్టీలు తీవ్ర నైరాశ్యం వ్యక్తం చేస్తున్నాయి. 2020లో గెలిచిన 110 సీట్ల కంటే కూడా ఇంకా తక్కువ సీట్లు వస్తాయని అంచనాలు వెలువడడంతో మహాఘట్ బంధన్ నేతలు నిట్టూర్చుతున్నారు. ఈ అంచనాల ప్రకారం, తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ అత్యంత దారుణంగా దెబ్బతింటుందని అంచనాగా ఉంది. గత ఎన్నికల్లో ఆర్జేడీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించగా, అంతలోనే మార్పు వచ్చి, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్టు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారీ నిజం అవుతాయని చెప్పలేం. గతంలోనూ కూడా బీహార్ ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ పలుమార్లు తప్పుగా అంచనా వేశాయి. అయితే, ఈసారి దైనిక్ భాస్కర్, మ్యాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ పాటు 9 ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎన్డీయేకి విజయం దక్కుతుందని అంచనా వేశాయి. దాదాపు అన్ని సంస్థలూ ఎన్డీయేకి 130 నుంచి 167 వరకు సీట్లు వస్తాయని, మహాకూటమికి 73 నుంచి 108 స్థానాలు దక్కుతాయని అంచనా వేశాయి. ఇక, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
Read Also- Huzurabad: జాతీయస్థాయి కరాటే పోటీల్లో.. హుజూరాబాద్ విద్యార్థుల అద్భుత ప్రదర్శన!
