Huzurabad (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Huzurabad: విద్యార్థులతో ధ్యాన మహాయజ్ఞం.. ఏకాగ్రత కోసం ధ్యానం నిత్యకృత్యం కావాలి : కమిషనర్ సమ్మయ్య

Huzurabad: పిరమిడ్ ధ్యానం వ్యవస్థాపకులు, బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జన్మదినాన్ని పురస్కరించుకుని, యువతలో ఆధ్యాత్మిక, మానసిక వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో హుజురాబాద్ పట్టణంలో ఒక బృహత్తర కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలి’ అనే గొప్ప సంకల్పంతో, పిరమిడ్ మాస్టర్ చింత అనిల్ అధ్యక్షతన పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్‌లో ‘ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సమూహ ధ్యానంలో వందలాది మంది విద్యార్థులు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో హుజురాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9వ, 10వ తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం మొదలై, గంట వరకు విద్యార్థులందరితో కలిసి ఒక గంట పాటు సామూహిక ధ్యానం నిర్వహించడం జరిగింది. ఈ ప్రశాంత దృశ్యం వేలాది మందిలో ఏకాగ్రతను, ప్రశాంతతను నింపివేసింది.

Also Read: Huzurabad: బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం.. డీబీఎల్ కంపెనీపై సింగపూర్ రైతుల ఆగ్రహం!

ధ్యానం క్రమశిక్షణ, ఉన్నతికి మార్గం: మున్సిపల్ కమిషనర్

ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ, ధ్యానం కేవలం ఆధ్యాత్మిక అంశం కాదని, ఇది విద్యార్థుల జీవితంలో క్రమశిక్షణను, ఏకాగ్రతను పెంచే శక్తివంతమైన సాధనమని ఉద్ఘాటించారు. “పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే, తప్పనిసరిగా ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి” అని ఆయన ప్రత్యేకంగా సందేశమిచ్చారు.

ఈ ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం

ఒత్తిడి నివారణపై డాక్టర్ వేదాంతం శ్రీదేవి ముఖ్య అతిథి, హన్మకొండ రిటైర్డ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం శ్రీదేవి మేడం ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య, మానసిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా, జ్ఞాపకశక్తి పెరుగుదల మరియు చదువుల ఒత్తిడిని సమర్థవంతంగా నివారించే అంశంపై ఆమె ప్రసంగం విద్యార్థులను ఆలోజింపజేసింది. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ చైర్మన్ రాములు, విద్యావంతుల వేదిక వేల్పుల రత్నం, మాజీ కౌన్సిలర్‌తో పాటు పలువురు విద్యావేత్తలు, ప్రముఖులు పాల్గొని సందేశాలు అందించారు. ఈ ‘ధ్యాన విద్యార్థి మహాయజ్ఞం’ కార్యక్రమం హుజురాబాద్ విద్యార్థులలో నూతన చైతన్యాన్ని నింపిందని నిర్వాహకులు తెలియజేశారు.

Also Read: Huzurabad: ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలిన టపాకాయల దుకాణం.. భయం గుప్పిట్లో హుజురాబాద్

Just In

01

Gadwal District: నిధులు లేక నిరీక్షణ రెండేళ్ల నుంచి రాని గ్రాంట్లు.. చెక్కులు పాస్ కాక పంచాయతీ కార్యదర్శుల అవస్థలు

Santana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదలైంది..

Balaram Naik: ప్రమాద రహిత సింగరేణి ధ్యేయంగా పనిచేయాలి : సీఎండీ ఎన్.బలరామ్

Anu Emmanuel: ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో దుర్గ క్యారెక్టర్ నా కోసమే పుట్టింది.. అను ఇమ్మాన్యుయేల్

Kunamneni Sambasiva Rao: పేద ధనిక అంతరాలను తొలగించే ఏకైక మార్గం సోషలిజమే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు