Delhi Blast: ఢిల్లీలో కారు బాంబు పేలటానికి కొన్ని గంటల ముందే పోలీసులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్ పోలీసులు అందించిన సమాచయారంతో దాడులు జరిపి ఓ ఇంటి నుంచి 350 కిలోల అమ్మోనియం నైట్రేట్, రైఫిల్, 20 టైమర్లను సీజ్ చేశారు. దాంతోపాటు మూడు బుల్లెట్ మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. గతనెల 27నశ్రీనగర్ లో ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మమ్మద్ కు అనుకూలంగా పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.
Also Read: Delhi Car Blast: దిల్లీలో భారీ పేలుడు.. ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్.. గాల్లోకి ఎగిరిపడ్డ మృతదేహాలు
దీనిపై విచారణ జరిపిన స్థానిక పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగాడాక్టర్ ఆదిల్ అహ్మద్ వీటిని అతికించినట్టుగా నిర్ధారించుకున్నారు. గతంలో అనంత్ నాగ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేసిన ఆదిల్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్ పూర్ లోని ఓ హాస్పిటల్ లో పని చేస్తున్నట్టుగా నిర్దారించుకున్నారు. ఈ క్రమంలో ఆదిల్ ను అదుపులోకి తీసుకుని అతని లాకర్ నుంచి ఓ రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆదిల్ వెల్లడించిన వివరాల మేరకు ఫరీదాబాద్ లోని ఓ ఇంటి నుంచి అమ్మోనియం నైట్రేట్ తోపాటు పిస్టళ్లు, బుల్లెట్లు, టైమర్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Delhi Explosion: దిల్లీ బ్లాస్ట్‌పై సీపీ స్పందనిదే.. దర్యాప్తుకు ఆదేశించిన హోం మినిస్టర్
