CM Yogi Adityanath (Image Source: Twitter)
జాతీయం

CM Yogi Adityanath: యూపీ సీఎం మరో సంచలనం.. ఇకపై స్కూళ్లల్లో అది తప్పనిసరి.. కీలక ఆదేశాలు జారీ

CM Yogi Adityanath: దేశంలో అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన సంచన నిర్ణయాలకు కేరాఫ్ గా నిలుస్తుంటారు. రౌడీయిజం అణిచివేత, బూల్డోజర్లతో అక్రమ కట్టడాల కూల్చివేత వంటి చర్యలతో ఆయన పేరు తరుచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే యూపీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థల్లో వందేమాతరం పాడటం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు.

గీతాలాపన తప్పనిసరి

ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో జనతా దర్శనం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ గీతం వందేమాతరం పట్ల తనకున్న గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. ఈ గీతాన్ని రాష్ట్రంలోని ప్రతీ స్కూల్, కాలేజీలో విద్యార్థులు తప్పనిసరిగా ఆలపించాలని ఆదేశించారు. వందేమాతరం ఆలపించడం ద్వారా పౌరుల్లో దేశం పట్ల ప్రేమ, భక్తి పెరుగుతాయని యోగి అభిప్రాయపడ్డారు.

వందేమాతరంలో మార్పులు

మరోవైపు దేశ సమగ్రత, ఐక్యతను దెబ్బతీసే అంశాలను ఆదిలోనే గుర్తించడం చాలా ముఖ్యమని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కులం, మతం, భాష పేరుతో విభజించే అంశాలను ముందే గుర్తించి.. ఆ ఆలోచనలను సమాధి చేయాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సీఎం యోగి విమర్శలు చేశారు. వందేమాతరం పాటలో ఆ పార్టీ మార్పులు చేసిందని మండిపడ్డారు. జాతీయ ఐక్యతకు ఆటంకం కలిగించే విశ్వాసాలను ప్రతీ ఒక్కరు పక్కన పెట్టాలని హితవు పలికారు.

Also Read: Andesri Passed Away: అస్తమించిన అందెశ్రీ.. ప్రముఖుల సంతాపం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

కాంగ్రెస్‌పై మోదీ ఆరోపణలు

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1937లో ఈ గేయంలో కొన్ని చరణాలను తొలగించారని ఆరోపించారు. ఇదే దేశ విభజనకు కారణమైందంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. జాతి నిర్మాణం కోసం రూపొందించిన గీతానికి ఎందుకు అన్యాయం చేశారంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వందేమారం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఆయన రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఇది ప్రచురితమైంది.

Also Read: Telangana BJP: పోల్ మేనేజ్‌మెంట్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వర్కౌట్ అయ్యేనా..!

Just In

01

Dhandoraa: బిందు మాధవి వేశ్యగా నటిస్తున్న మూవీ విడుదల ఎప్పుడంటే?

Smart Phone : ఐక్యూఓఓ 15 యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. 5 ఏళ్ల OS అప్‌డేట్‌, 7 ఏళ్ల సెక్యూరిటీ అష్యూరెన్స్ ప్రకటించిన కంపెనీ!

Local Body Elections: స్థానిక సమరంపై గంపెడు ఆశలు.. ఉపఎన్నిక తర్వాతే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌?

Gadwal Sand Mafia: గద్వాల జిల్లాలో దర్జాగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

Abhinay Kinger death: ప్రముఖ తమిళ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూత.. చివరి క్షణాల్లో సాయం కోసం..