New Delhi (imagecredit:twitter)
జాతీయం

New Delhi: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. ఆందోళనకు దిగిన ప్రజలు

New Delhi: దేశ రాజధాని న్యూఢిల్లీ(New Delhi)లో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. రోజురోజుకు అక్కడ నాణ్యత క్షీణిస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, ఇండియా గేట్(India Gate) దగ్గర భారీ నిరసన చేపట్టారు. ఇందులో పర్యావరణ వేత్తలు, ఇతర ప్రజలు పాల్గొన్నారు. ఈ నిరసనపై పర్యావరణవేత్తలు మాట్లాడుతూ, ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బ తింటున్నాయని అన్నారు.

Also Read: Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?

పిల్లల జీవితకాలం..

స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే ఢిల్లీ పిల్లల జీవితకాలం పదేళ్లు తక్కువగా ఉన్నదని వివరించారు. అందుకే తల్లిదండ్రులు, ప్రజలు ఆదివారం రోడ్డెక్కారని తెలిపారు. దీనిపై వివరించేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ అడిగితే నిరాకరించారని అన్నారు. కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. స్వచ్ఛమైన గాలి(Fresh air)ని అందించడంలో ప్రభుత్వ విఫలమైందని ఆరోపించారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు మండిపడ్డారు. మరోవైపు, ముందస్తు అనుమతి లేకుండా ఇండియా గేట్ దగ్గర నిరసన చేపట్టిన కొందరిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.

Also Read: SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

Just In

01

Dhandoraa: బిందు మాధవి వేశ్యగా నటిస్తున్న మూవీ విడుదల ఎప్పుడంటే?

Smart Phone : ఐక్యూఓఓ 15 యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. 5 ఏళ్ల OS అప్‌డేట్‌, 7 ఏళ్ల సెక్యూరిటీ అష్యూరెన్స్ ప్రకటించిన కంపెనీ!

Local Body Elections: స్థానిక సమరంపై గంపెడు ఆశలు.. ఉపఎన్నిక తర్వాతే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌?

Gadwal Sand Mafia: గద్వాల జిల్లాలో దర్జాగా ఇసుక దందా.. పట్టించుకోని అధికారులు

Abhinay Kinger death: ప్రముఖ తమిళ నటుడు అభినయ్ కింగర్ కన్నుమూత.. చివరి క్షణాల్లో సాయం కోసం..