Medchal News: మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి పూడూరు గ్రామంలోని శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయ నిర్వహణ విషయంలో వివాదం నెలకొంది. పూడూరు(Puduru) గ్రామ నడిబొడ్డున 25సంవత్సరాల క్రితం శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయాన్ని నిర్మించారు. కాగా అప్పట్లో గ్రామస్తులందరూ కలిసి గ్రామంలోని వివిధ కులాలకు చెందిన వ్యక్తులను కలుపుకొని ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. సదరు ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మూడేళ్లకొక్కసారి బోనాల జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయం నిర్మించినప్పటి నుండి నేటి వరకు ఆలయ నిర్వహణ మొత్తం కమిటీ ఆధ్వర్యంలోని కొనసాగుతుంది.
కమిటీ సభ్యులు ఆసక్తి..
ఇది ఇలా ఉండగా గ్రామంలోని మరి కొంతమంది వ్యక్తులు సైతం కమిటీలో తమకు కూడా అవకాశం ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా బోనాల జాతర ముందు ఏర్పాట్ల చర్చల సందర్భంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరి డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న కమిటీ సభ్యులు ఆసక్తి ఉన్నవారు పేర్లు ఇవ్వాలని కోరడంతో ఇచ్చారు. ఇదే సంవత్సరం మే నెలలో నిర్వహించిన జాతర ఉత్సవాలకు ముందు సైతం కమిటీ సభ్యులకు గ్రామంలోని మరి కొంతమంది వ్యక్తులకు కమిటీ నిర్వహణ విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
Also Read: Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
ఆలయానికి ప్రభుత్వ ట్రస్ట్ బోర్డు..
దీంతో వారు జాతర ముగిసిన అనంతరం ఆగస్ట్ నెలలో శ్రీ శివంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయానికి ప్రభుత్వ ట్రస్ట్ బోర్డు(Government Trust Board)ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.వెంటనే స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు అదే నెల 18వ తేదీన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు కోసం నోటీసులు జారీచేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని కోరారు. ఈ ఘటన గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి ఇటీవల రావడంతో అప్రమత్తమైన కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్తుల సంతకాలు సేకరించి పంపించినట్లుగా తెలిసింది.
Also Read: Stress Relief: మతిమరుపు, ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే, ఈ చిట్కాలు పాటించండి!
