Janhvi Kapoor: దివంగత లెజెండరీ నటి శ్రీదేవి (Sridevi) కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కెరీర్ విషయంలో నిరంతరం ఎదురవుతున్న ప్రశ్న ఒకటే.. కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమవుతుందా? లేక తల్లిలాగే అద్భుతమైన నటనతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందా? బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆమెకు అసలు సిసలు నటిగా గుర్తింపు దక్కలేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె చేసిన కొన్ని పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో, జాన్వీ తన అభినయ సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిరూపించుకోలేకపోయిందనే అభిప్రాయం ఉంది.
Also Read- AR Rahman Concert: ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్‌లో ‘పెద్ది’ టీమ్.. ‘చికిరి చికిరి’కి సౌండ్ అదిరింది
సౌత్‌లో ‘దేవర’ నిరాశపరిచిందా?
సౌత్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించిన జాన్వీ కపూర్ ఎంచుకున్న తొలి చిత్రం, జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సరసన నటించిన ‘దేవర’ (Devara). భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలైనప్పటికీ అనుకున్నంతగా సక్సెస్ రాలేదనేది బాక్సాఫీస్ రిపోర్ట్. అలాగే ఇందులో జాన్వీ పాత్ర కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితమైందనే టాక్ బలంగా ఉంది. ‘దేవర’ లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌కు నటనా సామర్థ్యం ప్రదర్శించే అవకాశం దక్కకపోవడం అభిమానులను, విమర్శకులను కొంత నిరాశపరిచింది. సౌత్ ప్రేక్షకులు అందాలను ఆస్వాదించినప్పటికీ.. నటన, అభినయానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే విషయం జాన్వీ కపూర్ గమనించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం గ్లామర్‌పై ఆధారపడితే, ఇక్కడ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టం.
‘పెద్ది’లోనైనా మెప్పిస్తుందా?
‘దేవర’ తర్వాత జాన్వీ కపూర్ ఎంచుకున్న మరో తెలుగు చిత్రం – ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ‘పెద్ది’ (Peddi). రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాటలో కూడా జాన్వీ కపూర్ గ్లామర్ ప్రదర్శనతోనే కనిపించింది. దీంతో మళ్లీ ఇదే తరహా పాత్రేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే, దర్శకుడు బుచ్చిబాబు సానా చెబుతున్న ప్రకారం, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, నటనకు మంచి స్కోప్ ఉంటుందని తెలుస్తోంది. ‘ఉప్పెన’లో హీరోయిన్ పాత్రను ఎంత బలంగా చూపించారో, ‘పెద్ది’లో కూడా జాన్వీ క్యారెక్టర్‌ను అంతే పవర్ఫుల్‌గా తీర్చిదిద్దినట్లు సమాచారం.
Also Read- Samantha: ఏదో ఒకటి తేల్చేయవచ్చుగా… ఎందుకీ దాగుడుమూతలు?
స్టార్ స్టేటస్ కోసం ‘పెద్ది’ కీలకం
ఒకవేళ ‘పెద్ది’ చిత్రం అనుకున్నంత విజయం సాధించి, జాన్వీ కపూర్ తన పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను కనబరిస్తే మాత్రం… ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ లభించే అవకాశం ఉంది. శ్రీదేవి వారసురాలిగా వచ్చిన జాన్వీ.. కేవలం అందానికే కాకుండా, అభినయానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా నిలబడితేనే, ఇక్కడ ఆమె కెరీర్ సజావుగా సాగుతుంది. ‘పెద్ది’ ఫలితం, అందులో జాన్వీ నటన సౌత్ సినీ ప్రపంచంలో ఆమె భవిష్యత్తును నిర్దేశించే కీలక అంశాలుగా నిలవనున్నాయని చెప్పుకోవచ్చు. మరి, ‘పెద్ది’లో జాన్వీ తన పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల నోళ్లు మూయిస్తుందో, లేదా గ్లామర్ డాల్‌గానే మిగిలిపోతుందో వేచి చూడాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
