Temple hundi fire: దేవాలయాల్లో హుండీలు భక్తి, విశ్వాసం, నిబద్ధతలకు ప్రతీకలని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. తమ మనసులోని కోరికలు, కృతజ్ఞతలను వ్యక్తం చేసే మార్గమే హుండీ. మొక్కుకున్న రీతిలో, భక్తులు తమ స్థోమతకు తగిన స్థాయిలో డబ్బు, సంపన్నులైతే విలువైన ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను సమర్పించుకుంటుంటారు. దేవుడు ఇచ్చినదాంట్లో కొంత తిరిగి సమర్పించడం అనే భావనతో శతాబ్దాలుగా ఈ హుండీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఓ భక్తురాలు హుండీలో కానుకలు వేసే విషయంలో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. వెలుగుతున్న కార్పూరాన్ని హుండీలో (Temple hundi fire) వేసింది.
Read Also- Komatireddy Venkat Reddy: చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు.. రూ.60,799 కోట్లతో తెలంగాణలో రోడ్ల శకం
హుండీలో హారతి కర్పూరం
పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో అనూహ్యమైన ఘటన జరిగింది. ఓ భక్తురాలు ఆలయానికి వచ్చి భక్తితో హారతి కర్పూరాన్ని వెలిగించింది. ఆ తర్వాత దేవుడి రూపానికి కాంతిని చూపించి, అక్కడితో ఆగకుండా వెలుగుతున్న కర్పూరాన్ని తీసుకెళ్లి హుండీలో వేసింది. కొన్ని క్షణాల్లోనే హుండీ నుంచి పొగలు వస్తుండడంతో విషయాన్ని ఆలయ సిబ్బంది గుర్తించారు. అత్యుత్సాహంతో భక్తురాలు వేసిన కర్పూరం హుండీలోని నోట్లకు అంటుకొని, కొన్ని నోట్లు కాలిపోయాయి. హుండీలోని నిప్పును ఆర్పేందుకు తొలుత నీళ్లు పోయడంతో నోట్లు తడిసిపోయాయి. వాటిని ఆరబెట్టేందుకు ఆలయ సిబ్బంది ఒక చిట్కాను పాటించారు. హెయిర్ డ్రయర్‌తో నోట్లను పొడిబర్చారు.
Read Also- Chikiri song: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్..
