Bellamkonda Suresh: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) మరోసారి వార్తల్లో నిలిచారు. ఫిల్మ్ నగర్‌లోని రోడ్ నెంబర్ 7లో ఉన్న తన ఇంటిని కబ్జా చేశారంటూ శివ ప్రసాద్ (Siva Prasad) (అలంకార్) అనే వ్యక్తి ఆయనపై ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్ (Film Nagar Police Station)లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు బెల్లంకొండ సురేష్‌తో పాటు రమణ (Ramana) అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
ఇల్లు కబ్జా, ఫిర్యాదు
శివ ప్రసాద్ ఫిర్యాదు ప్రకారం… ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 7లో ఉన్న తన తాళం వేసిన ఇంటిని బెల్లంకొండ సురేష్ అక్రమంగా కబ్జా చేశారని పేర్కొన్నారు. కొద్ది కాలంగా తాళం వేసి ఉన్న తమ ఇంటికి సురేష్, ఆయన మనుషులు వచ్చి తాళం పగలగొట్టి ఇంటి నిర్మాణాన్ని ధ్వంసం చేశారని బాధితుడు తన ఫిర్యాదులో తెలిపారు. ఇదేంటని విషయం అడిగేందుకు వెళ్లిన తన సిబ్బందిపై సురేష్ దుర్భాషలాడి పంపించారని శివ ప్రసాద్ ఆరోపించారు. శివ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు బెల్లంకొండ సురేష్‌తో పాటు రమణ అనే వ్యక్తిపై బి.ఎన్.ఎస్ 329(4), 324(5), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్లలో ముఖ్యంగా అక్రమంగా ఇతరుల ఆస్తిని ఆక్రమించడం, దాడికి పాల్పడటం వంటి నేరాలుగా పరిగణించబడతాయి.
Also Read- Janasena X Account: జనసేన ట్విటర్ అకౌంట్ హ్యాక్!.. ఆదివారం ఉదయం ఏం పోస్టులు దర్శనమిచ్చాయంటే?
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఈ ఆరోపణలపై ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. బెల్లంకొండ సురేష్‌పై ఆరోపణలు, శివ ప్రసాద్ ఆరోపణల వెనుక వాస్తవాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన సినీ వర్గాల్లో కలకలం సృష్టించింది. సురేష్ లేదా ఆయన ప్రతినిధులు ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పందించలేదు. ఇటీవల కాలంలో బెల్లంకొండ సురేష్‌పై పలు ఆర్థిక లావాదేవీల (చీటింగ్) ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా మరో కేసు భూ వివాదం, ఆస్తి కబ్జా ఆరోపణలతో నమోదవడం విశేషం. ఈ కేసు యొక్క పూర్తి వివరాలు, బెల్లంకొండ సురేష్ స్పందన తదితర అంశాలు తదుపరి దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. బెల్లంకొండ సురేష్ తరఫు నుంచి ఈ ఆరోపణలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ కేసు వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. గత కొంత కాలంగా బెల్లంకొండ సురేష్ సినీ నిర్మాణంలో అంత హుషారుగా పాల్గొనడం లేదు. తన కుమారుడు మాత్రం హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఈ కేసుతో మరోసారి బెల్లంకొండ సురేష్ వార్తలలో నిలుస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
