Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: రెడ్యాలలో అంగరంగ వైభవంగా పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు!

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో అంగరంగ వైభవంగా పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు వెన్నం శ్రీకాంత్ రెడ్డి(Vennam Srikanth Reddy), వెన్నం విజయ్ కాంత్ రెడ్డి(Vennam Vijaykanth Reddy) లు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, భక్తులు హాజరు కావాలని ఆహ్వానాన్ని అందిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల క్రితం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి మంగళ శాసనములతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలను 10.11.2025 నుంచి 13.11.2025 వరకు కార్యక్రమాలు ఉంటాయని శ్రీ సీతా లక్ష్మణ మహోత్సవ మేత శ్రీ రామచంద్ర స్వామి దేవస్థానం నిర్వాహకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమ వివరాలు..

07.12.2020 లో సిద్దండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి దివ్య కరకముల ఆచరణాత్మకంలో రెడ్యాల సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి ప్రతిష్ట జరిగింది. నాటి నుంచి శ్రీ సీత రామచంద్ర స్వామి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతిష్ట నక్షత్రమైన మఖ నక్షత్రం ప్రకారం 10.11.2025 నుండి 13.11.2025 వరకు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 10.11.2025 న ఉదయం 6:00 నుండి సమిష్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం మంగళవాద్య వేద స్వస్తి వచనముల ద్వారా యాగశాల ప్రవేశం శ్రీవిశ్వనారాధనం, పుణ్యాహ వాచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమం ఉంటుంది.

Also Read: Mithramandali OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘మిత్రమండలి’.. కారణం అదేనా..

కళ్యాణ మహోత్సవం..

11.11.2025 న ఉదయం 8 గంటల నుండి ఆకాశాలలో ద్వారాతోరణం ధ్వజ కుంభ ఆరాధన, శతుస్థానార్చన, మహా కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ట, మూల మంత్ర హవన పారాయరాణాధులు, నిత్య పూర్ణాహుతి, ధ్వజారోహణం, అష్ట దిక్పాలక బలి ప్రధానం, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి, సాయంత్రం 6 గంటలకు దేవత ఆహ్వానం, యాగశాలలో నిత్య విధి హోమం, పూర్ణాహుతి, బలి ప్రధానం, ఆరగింపు, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి, 12.11.2025 న ఉదయం తొమ్మిది గంటలకు యాగశాలలో నిత్యారాదనము, శతస్థానార్చన, మూల మంత్ర హవన పారాయరాణాధులు, ఉదయం 10 గంటలనుండి శ్రీ సుదర్శన యాగం, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి, సాయంత్రం 6 గంటల నుండి యాగశాలలో నిత్యారాధనము, శత్రుత్వార్చన, మూల మంత్ర హవన పారాయరాణాధులు, రాత్రి ఏడున్నర గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం, రాత్రి 8.30 గంటలకు తీర్థ ప్రసాద గోష్టి, 13.11.2025 ఉదయం 9 గంటల నుండి యాగశాలలో నిత్యారాదినాదికం, చతుష్టార్చన, మూల మంత్ర హవన పారాయరాణాధులు, సంక్షేప రామాయణ హవనము, మహా పూర్ణాహుతి ఉదయం 11 గంటలకు నుండి నవ్వకాలాస స్నపనము, చక్ర స్నానము, మధ్యాహ్నం 1.00 కు మంగళ శాసనము, తీర్థ ప్రసాద గోష్టి, రుత్విక్ సన్మానము, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతా రామచంద్రస్వామి అనుగ్రహానికి పాత్రులు కాగలరని వెన్నం శ్రీకాంత్ రెడ్డి, బిందు, వెన్నం విజయ్ కాంత్ రెడ్డి.. శిల్ప, రాఘవేందర్ రెడ్డి, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

Also Read: AI Global Summit 2025: హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్ సమ్మిట్.. రాష్ట్ర చరిత్రలోనే ఓ కొత్త కోర్స్ ప్రారంభం

Just In

01

Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..

Chikiri song: గ్లోబల్ రికార్డ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ‘చికిరి’ సాంగ్..

Hyundai Venue 2025: హ్యుందాయ్ వెన్యూ 2025 ఎంట్రీతో SUV మార్కెట్లో రగడ.. టాటా, మారుతి, కియా, మహీంద్రాకి గట్టి పోటీ ఇస్తుందా?

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి

Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?