Mahesh Kumar Goud (imagecredit: swetcha)
Politics, తెలంగాణ

Mahesh Kumar Goud: ఓట్ చోరితో ప్రజాస్వామ్యానికి విఘాతం.. పీసీసీ మహేష్​ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: ఓట్ చోరితో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందని ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్ లో వీరు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. దేశంలో జరుగుతున్న వోట్ చోరీ పై రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓట్ చోరి పై కాంగ్రెస్‌ చేపట్టిన సంతకాల సేకరణకు 5 కోట్ల మందికిపైగా మద్దతు తెలిపారన్నారు. లోక్‌ సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలను కాంగ్రెస్‌ ఆధారాలతో సహా నిరూపిస్తోందన్నారు.

కర్ణాటకలోని మహదేవ్‌ పురం..

కర్ణాటకలోని మహదేవ్‌ పురం నియోజకరవర్గంలో ఓటర్ల జాబితాలో తప్పులను, బీజేపీ మోసాలను రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆధారాలతో సహా నిరూపించినా.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన కుట్రలను కూడా రాహుల్‌ గాంధీ పలు రుజువులతో సహా నిరూపించారన్నారు. హరియానాలో 25 లక్షలకుపైగా ఉన్న నకిలీ ఓటర్లున్నారని, 5 లక్షలకుపైగా ఉన్న డూప్లికేట్‌ ఓటర్లు, 93 ఓటర్ల తప్పుడు చిరునామాలు, లక్ష మందికిపైగా ఓటర్ల ఫోటోలు వివరాలు తప్పులుండడం వంటివి జరిగాయన్నారు.

Also Read: Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?

100 ఓటరు కార్డులు ఉండటం..

అక్కడ ఒకే మహిళ ఫోటోతో 22 ఎంట్రీలు.. 100 ఓటరు కార్డులు ఉండటం విస్మయానికి గురిచేస్తుందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పు చేతుల్లో కొనసాగడం బాధాకరమన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాహుల్ గాంధీ బీహార్‌లో ప్రారంభించిన ‘ఓటు అధికార్ ర్యాలీ’ బీజేపీలో వణుకు పుట్టించిందని మహేష్ గౌడ్ అన్నారు. హర్యానా ఫార్ములాను అనుసరించి బీజేపీ ఇప్పుడు బీహార్‌లో గెలవాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

Also Read: illegal Grain Transport: ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా రవాణా.. సరిహద్దుల్లో కానరాని సివిల్ సప్లై చెక్ పాయింట్లు

Just In

01

Hyundai Venue 2025: హ్యుందాయ్ వెన్యూ 2025 ఎంట్రీతో SUV మార్కెట్లో రగడ.. టాటా, మారుతి, కియా, మహీంద్రాకి గట్టి పోటీ ఇస్తుందా?

CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధి వెనుక కాంగ్రెస్ కృషి ఉంది: రేవంత్ రెడ్డి

Sandeep Reddy Vanga: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినోకరు ఫాలో చేసుకుంటున్న సందీప్ రెడ్డి, రామ్ చరణ్.. ఇది దేనికి సంకేతం?

Jio BSNL Partnership: గేమ్ మార్చబోతున్న అంబానీ.. జియో, బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఒప్పందం.. షాక్‌లో ఎయిర్‌టెల్, వొడాఫోన్

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. నాకు సంబంధం లేదు అంటూ..!