Ramagundam: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ గోదావరిఖని ప్రాంతాలలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది సహకారంతో 46 దారి మైసమ్మ గుడులు(Maisamma Temples) కూల్చివేశారు. గుడుల కూల్చివేతపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కూల్చివేతకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చౌరస్తా సమీపంలో కూల్చిన మైసమ్మ గుడి కూల్చిన చోటే పసుపు కుంకుమలు జల్లి, కొబ్బరికాయలు కొట్టి పునః ప్రతిష్టకు పూజలు నిర్వహించారు.
Also Read: Jubliee Hills Bypoll: ప్రచారంలో సీతక్క దూకుడు.. బైక్ ఎక్కి గల్లీల్లో పర్యటన.. కేడర్‌లో ఫుల్ జోష్!
నిరసన కార్యక్రమంలో..
ఈ సందర్భంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు అయోధ్య రవీందర్, సంతోష్ రెడ్డిలు మాట్లాడుతూ అర్ధరాత్రి దొంగల్లాగా మైసమ్మ గుడులను తొలగించి, మెజారిటీ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ గారిని, సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దుశ్చర్యలతో హిందూ సమాజాన్ని చాలెంజ్ చేస్తే చూస్తూ ఊరుకోమని, కూల్చిన 46 దారి మైసమ్మ గుడులను వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తమ సొంత ఖర్చులతో నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అయోధ్య రవీందర్, సంతోష్ రెడ్డి, రామ్మూర్తి గౌడ్, నాగుల మల్యాల సత్యం, అంజన్న, అడిగొప్పుల రాజు, మునగాల సంపత్, కోమల మహేష్, కొండపర్తి సంజీవ్ కుమార్, ముసుకుల భాస్కర్ రెడ్డి, సుల్వ లక్ష్మీ నరసయ్య, ఐత పవన్, గుండబోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్, రాకేష్, విశ్వాస్, మడికొండ శ్రీనివాస్, పిడుగు కృష్ణ, శివరామకృష్ణ,బుంగ మహేష్, వివిధ గుడుల బస్తీ పెద్ద మనుషులు పాల్గొన్నారు.
Also Read: Telangana Winter Season: తెలంగాణలో సడెన్‌గా మారిపోయిన వాతావరణం.. ఈ ఏడాది చలి అంచనా ఇదే
