Cotton Farmers (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Cotton Farmers: జాతీయ రహదారులపై రైతుల ఆందోళన .. భారీగా నిలిచిపోయిన వాహనాలు

Cotton Farmers: పత్తి పంట రైతులకు జరుగుతున్న అన్యాయలకు నిరసనగా శనివారం సంగారెడ్డి(Sangaredddy) జిల్లా, సుల్తాన్‌ పూర్, కంకోల్‌ టోల్‌ గేట్ల వద్ద జిల్లాలోని పత్తి రైతులతో రాస్తారోకో కార్యక్రమాన్ని రైతు సంఘాలు, జిల్లా పెస్టిసైడ్స్, సీడ్స్‌ డీలర్స్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించారు. వందల సంఖ్యలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు టోల్‌గేట్‌ల వద్దకు చేరుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేసారు. రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేయబోగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు సంకెళ్లతో ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ నిరసన తెతలియజేశారు. రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు.

పరిమితిని కుదిస్తూ..

ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొత్తగా ప్రవేశ పెట్టిన స్లాట్‌ విధానాన్ని ఏత్తివేయాలని. గతంలో ఉన్న ఎకరానికి ఉన్న 12 క్వింటల్‌ పరిమితిని కుదిస్తూ 7 క్వింటల్‌ గా తీసుకున్న నిర్ణాయాన్ని తక్షణమే అపేయలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేసారు. ఖరీఫ్‌ సీజన్‌‌లో కురిసిన అధిక వర్షాల వల్ల తేమ శాతం గతంలో నిర్ధారించిన 8 –12 కంటే అధికంగా 15 నుంచి 16 శాతం వరకు వస్తుందని. 15–16 శాతం తేమ పరిమితిని అనుమతించాలని రైతులు కోరుతున్నారు.

Also Read: Suri Gang Arrested: రౌడీ షీటర్ సూరి గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

నిలిచిపోయిన వాహనాలు

నాందేడ్‌–అకోలా జాతీయ రహదారిపై తాడ్దాన్‌పల్లి టోల్‌ టాక్స్‌ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించడంతో గంట సేపు వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో చివరకు రాస్తారోకోను విరమింపజేసారు.

Also Read: GHMC: హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం.. జీహెచ్ఎంసీ డ్రెయిన్ల మ్యాపింగ్ ప్రక్రియ షురూ

Just In

01

Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్​ ఉత్తర్వులు జారీ

Abhishek Sharma: వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర నెలకొల్పిన అభిషేక్ శర్మ

Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!

Kishan Reddy: అసలు ఆట ఇంకా మొదలవ్వలే.. రానున్న రోజుల్లో మొదలుపెడతాం..!

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో వృద్ధుడు.. రూ.5 లక్షలు వెనక్కి వచ్చేలా చేసిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?