BJP Paid Crowd: రాజకీయ పార్టీలు, నాయకులు తమ సభలు, సమావేశాలు, రోడ్ షోలకు జనాలను రప్పించుకునేందుకు అగచాట్లు పడుతుంటారు. బల ప్రదర్శన కోసం, జనాల్లో తమ క్రేజ్‌ను హెచ్చించి చూపించుకోవడం కోసం కొన్నిసార్లు ట్రిక్స్ ప్లే చేస్తుంటాయి. తమ పార్టీ కార్యకర్తలకు, లేదా స్థానిక జనాలకు డబ్బులు ఇచ్చి, ఇతర తాయిళాలు ఆశచూపించి జనాలతో ‘కృత్రిమ జేజేలు’ కొట్టించుకుంటుంటారు. ఈ తరహా ఘటనలు ఎన్నో దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే, కేంద్రంలో వరుసగా మూడవ పర్యాయం అధికారంలో కొనసాగుతున్న బీజేపీ కూడా ఇవే ‘చీప్ ట్రిక్స్’ (BJP Paid Crowd) అనుసరిస్తున్నట్టు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమవుతోంది.
పూలు చల్లితే రూ.500!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలోని సభకు హాజరైనా, ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోతుంది. ఆఖరికి మోదీ వేదిక వద్దకు చేరుకునే మార్గం కూడా పూలవనాన్ని తలపిస్తుంటుంది. జనాలతో కిక్కిరిసిపోయి, సెక్యూరిటీ పెన్సింగ్ అవతలి నుంచే మోదీపై పూల వర్షం కురుస్తుంటుంది. ఆయన వెళ్లిన దాదాపు అన్నిచోట్లా, సాధారణ మార్గాలు కూడా పూలబాటలుగా మారిపోతుంటాయి. ఇక, మోదీ స్థాయిలో కాకపోయినా, ఇతర అగ్రనేతల సమావేశాల్లోనూ ఇంచుమించుగా ఇదే తరహా సందడే కనిపిస్తుంటుంది. కానీ, ఇదంతా ‘తెరచాటు పక్కా ప్లానింగ్’ అంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమ బిల్డప్పుల కోసం.. డబ్బులు ఇచ్చి మరీ ప్రజలతో బీజేపీ డ్రామాలు ఆడిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నాయకులపై పువ్వులు చల్లేందుకు.. పూలతో పాటు రూ.500 అందిస్తారంటూ పేర్కొంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఇటీవల ఓ చోట ప్రధాని మోదీ రోడ్ షోలో పూలు చల్లి, హారతి ఇచ్చిన వారికి డబ్బు ఇచ్చినట్టుగా బీజేపీపై సెటైర్లు పేలుడుతున్నాయి.
Read Also- Snake In Scooty: అయ్యబాబోయ్.. స్కూటీలోకి దూరిన పాము.. జస్ట్ మిస్ లేదంటేనా..!
ప్యాకేజీలు ఇవేనట!
నేతలు, నాయకుల బిల్డప్పుల కోసం బీజేపీ చక్కటి ప్యాకేజీలు ఇస్తోందంటూ పొలిటికల్ సెటైర్లు పేలుతున్నాయి. పూలు చల్లితే రూ.500, నాయకులకు హారతి ఇస్తే రూ.700, మోదీని చూసి ఉద్వేగానికి గురై ఏడిస్తే రూ.1,000 ఇస్తారని చెప్పుకుంటున్నారు. అత్యధికంగా, మోదీని దేవుడని పిలిస్తే రూ.1,200 ఇస్తారని కొందరు వ్యక్తులు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, అలాంటి వీడియోనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తెగ సర్క్యూలేట్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక కనకాంబరాలను ఒక కవర్‌లో పట్టుకొని ఇంట్లోని కిటీకి వద్ద నిలబడింది. జేపీ నడ్డా మార్గం వెంట వెళుతున్నప్పుడు ఆ పువ్వులను ఆయన చల్లడం ఆమె డ్యూటీ. అందుకుగానూ తన రూ.500 ఇస్తారని, పువ్వులు కూడా వాళ్లే తీసుకొచ్చి ఇస్తారని సదరు మహిళ తన కూతురితో చెప్పుతుండడం ఆ వీడియోలో కనిపించింది.
ఒక్క బీజేపీ అని కాదు గానీ, అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన ‘పేయిడ్ క్రౌడ్’, తెరవెనుక డ్రామాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. ఇక, నాయకుడిని చూడగానే ఉద్వేగభరితంగా ప్రవర్తించడం, హారతులు పట్టడం, పూలు వర్షం కురిపించడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయాయి. అన్నీ అబద్ధం కాకపోవచ్చేమో గానీ, తెరవెనుక ట్రిక్స్ కూడా చాలానే ఉంటాయి. నాయకుల ఇమేజ్‌ను పెంచడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి, ప్రజల్లో పాపులారిటీని పెంచుకోవడానికి పార్టీలు, లేదా నాయకులు ఈ కిటుకులు ప్రదర్శిస్తుంటారు. తాజాగా, బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్న వీడియో వైరల్ కావడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఎవరి బాధలు వారివి’ అంటూ హస్యంగా స్పందిస్తున్నారు.
