Heart Attack (imagecredit:swetcha)
క్రైమ్

Heart Attack: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్‌ఎస్ నేత

Heart Attack: బీఆర్‌ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఛైర్మన్ చెల్లొటి కిషన్ రెడ్డి(Chelloti Kishan Reddy) వివాహా భారత్‌లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో పోతిరెడ్డిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

కూతురి వివాహం సందర్భంగా..

పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి తన బంధువు రఘోత్తమ రెడ్డి కూతురి వివాహం సందర్భంగా హన్మకొండలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం గ్రామంలో నిర్వహించిన పెళ్లి ‘బారాత్’ (ఊరేగింపు)లో ఆయన ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కూలిపోయారు. వెంటనే స్థానికులు ఆయనను హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే కిషన్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కిషన్ రెడ్డి గతంలో కూడా గుండె సంబంధిత చికిత్సలు చేయించుకున్నట్లుగా సమాచారం. పార్టీలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత ఆకస్మిక మరణంతో పోతిరెడ్డిపేట గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శనివారం ఆయన పార్థివ దేహం వద్ద పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Also Read: Vaishnavi Constructions: సీఎంవో ఆదేశాలు బేఖాతరు.. రూ.900 కోట్ల విలువైన భూమికి ఎసరు​

కిషన్ రెడ్డికి నివాళులు..

మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు(V. Lakshmi Kantha Rao) దంపతులు పోతిరెడ్డిపేట వెళ్లి కిషన్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(Gangadi Krishna Reddy) స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి కిషన్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కిషన్ రెడ్డి నీటి సంఘం అధ్యక్షునిగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌గా, కాంట్రాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రైతులకు, గ్రామ ప్రజలకు ఎన్నో సేవలను అందించారని గుర్తు చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమన్నారు. గంగాడి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పారుపెల్లి కొండల్ రెడ్డి, కార్యదర్శి చిదురాల శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బైరెడ్డి సంపత్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read: Jubliee Hills Bypoll: ప్రచారంలో సీతక్క దూకుడు.. బైక్ ఎక్కి గల్లీల్లో పర్యటన.. కేడర్‌లో ఫుల్ జోష్!

Just In

01

Abhishek Sharma: వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర నెలకొల్పిన అభిషేక్ శర్మ

Sujeeth: సుజీత్‌కు అదృష్టం ఏంటి ఇలా పట్టింది? పొగడకుండా ఉండలేకపోతున్నారుగా!

Kishan Reddy: అసలు ఆట ఇంకా మొదలవ్వలే.. రానున్న రోజుల్లో మొదలుపెడతాం..!

Cyber Crime: సైబర్ మోసగాళ్ల వలలో వృద్ధుడు.. రూ.5 లక్షలు వెనక్కి వచ్చేలా చేసిన కానిస్టేబుల్.. ఏం చేశాడంటే?

The Great Pre-Wedding Show: ‘బలగం’ తరువాత మళ్లీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రమిదేనట!