Dharmapuri Arvind: నిజామాబాద్ జోరుగా పేకాట అడ్డాలుగా మారిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.పేకాట స్థావరాలపై నిజామాబాద్ ఎంపి అయిన ఎంపీ అరవింద్ గాటుగా స్పందించారు. జిల్లాలో పొలిటికల్ పార్టీల లీడర్లే పేకాట ఆర్గనైజర్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రతిరోజు జిల్లాలో పేకాట ఆడుతూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని అన్నారు. ఓవ వేళ బిజెపి నాయకులు పేకాట వ్యవహారంలో ఉంటే వెంటనే వాటిని మానుకోండని ఎంపీ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలుస్తున్న వారికి ఈ మెసేజ్ వర్తిస్తుందా…! అలాగే రోజు కొనసాగుతే వారి రాజకీయ జీవితమంతా ప్రశ్నార్థకమే అంటూ ఎంపీ అరవింద్ హెచ్చరికలు చేశారు.
బీజేపీ నేతలు కొంత మంది..
జిల్లాలో కొంతమంది బీజేపీ నేతలు కొంత మందితో కలిసి పేకాట అడుతున్నారనే సమాచారం తన వద్ద ఉందని ఆయన అన్నారు. పేకాట ఆడతున్న కొందరి వ్యక్తుల పేర్లు నా దృష్టిలో ఉన్నాయని వాటిపై వెరిఫై చేస్తున్నా అంటూ వార్నింగ్ం ఇచ్చారు. దీంతో బీజేపీ పార్టీలో ఎంపీ అరవింద్ మటలు ఇప్పుుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జిల్లాలో చాలాకాలంగా కొంతమంది బిజెపి నేతలు పేకాట ఆడిస్తున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పేకాట విహారంలో బిజెపి ఎంపీ అరవింద్ రియాక్ట్ అయిన తీరు పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు అలజడి రేపుతుంది.
Also Read: KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
నేడు మధ్యాహ్నం వరకు..
నిజామాబాద్ జిల్లాలో జోరుగా పత్తాలాట నడుస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది. భారతీయ జనతా పార్టీ నుండి ఎవరైనా నాయకులు ఈ వ్యవహారం నడిపిస్తుంటే, ఈ క్షణం నుండే( తేది 03/11/2025 మధ్యాహ్నం 1:21 నిముషాలు)మానుకోండి. లేదంటే మీ తదుపరి రాజకీయ జీవితమంతా ప్రశ్నార్థకమవుతుందని నాయకులకు ఆమయన స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Allu Arjun: జక్కన్న, నీల్, వంగా.. బన్నీ లైనప్ చూస్తుంటే మెంటలొచ్చేస్తుంది! ఇక తగ్గే దే లే..
