GHMC (imagecvredit:twitter)
హైదరాబాద్

GHMC: అంతా మీ ఇష్టమా.. మా అనుమతులు తీసుకోరా.. జలమండలిపై జీహెచ్ఎంసీ గరం గరం

GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసుల దాహార్తిని తీర్చే జల మండలికి జీహెచ్ఎంసీ(GHMC) ఊహించని ఝలక్ ఇచ్చింది. సిటీలోని పలు ప్రాంతాల్లో కొత్త పైప్ లైన్ల ఏర్పాటు, మరికొన్ని చోట్ల లీకేజీలకు మరమ్మతులు వంటివి చేపట్టేందుకు జలమండలి తవ్వకాలు చేపట్టింది. కొన్నింటికి జీహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకుని, మరికొన్ని సర్కిళ్లలో ఎలాంటి అనుమతి లేకుండా రోడ్లను తవ్వి పనులు చేపట్టింది. దీంతో ఛార్జీలను వడ్డించినట్లు సమాచారం. ఇటీవలే జీహెచ్ఎంసీ రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్, ఆ తర్వాత రెండు దశలుగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ రోడ్లపై ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేసిన గుంతలను గుర్తించారు. వీటిలో పనులు ముగిసిన తర్వాత కొన్నింటిని పూడ్చేసినా, అక్కడ రోడ్డు రెస్టోరేషన్ చేయనట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.

రూ.58 కోట్ల వడ్డెన..

ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు జల మండలి నగరంలో చేపట్టిన భారీ పనులను సైతం గుర్తించిన జీహెచ్ఎంసీ, వాటిల్లో అనుమతులు లేకుండా భారీగా గుంతలను తవ్వినట్లు గుర్తించింది. రోడ్లపై గుంతలు ఎవరు తవ్వినా ప్రత్యక్షంగా, పరోక్షంగా జీహెచ్ఎంసీ అప్రతిష్ట పాలవుతున్నది. వాస్తవానికి రోడ్డు తవ్వేముందు జీహెచ్ఎంసీ నుంచి అనుమతికి దరఖాస్తు చేస్తే, పైప్ లైన్ ఏర్పాట్లు, అండర్ గ్రౌండ్ కేబుల్ వంటి పనులకు తవ్విన గుంతను రెస్టోరేషన్ ఛార్జీలను అంచనా వేసి, చెల్లించిన తర్వాతే అనుమతులు జారీ చేస్తుంది. జల మండలి(Water Board) మార్చిలో చేపట్టిన పదుల సంఖ్యలోని పనుల్లో ఎక్కువగా అనుమతులు లేవు. వీటిలో కొన్ని ప్రాంతాల్లో బీటీ రోడ్లు, మరి కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లతో పాటు వీడీసీసీ రోడ్లు కూడా ఉన్నాయి. అనుమతి లేకుండా జల మండలి తవ్విన రోడ్లను గుర్తించి, రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్‌(Road Safety Special Drive)లో భాగంగా ఈ గుంతలను జీహెచ్ఎంసీ పూడ్చివేసింది. నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే, ముంబై జాతీయ రహదారిపైనున్న నానల్ నగర్‌లో భారీ పైప్ లైన్ పనులు చేపట్టిన జల మండలి ఇటీవలే పనులు ముగించినా, ఇంకా ఆ రోడ్ రెస్టోరేషన్ చేయకుండానే వదిలేసింది. ఈ జంక్షన్‌లో ధ్వంసమైన రోడ్డుకు సంబంధించి జీహెచ్ఎంసీకి పౌరుల నుంచి పదుల సంఖ్యలో ఫిర్యాదులొచ్చినట్లు తెలిసింది. ఒక్కో గుంత సైజు, బీటీ(BT), సీసీ(CC), వీడీసీసీ(VDCC) రోడ్డును బట్టి ఛార్జీలను ఫిక్స్ చేసి మొత్తం రూ.58 కోట్ల వరకు జల మండలికి ఛార్జీలను అధికారులు వడ్డించారు.

Also Read: Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే?

చెల్లింపుల్లో సర్దుబాటు

జీహెచ్ఎంసీ చెల్లించాల్సిన వాటర్ బిల్లు, ఇతర ఛార్జీలతో ఈ రూ.58 కోట్లను సర్దుబాటు చేయాలని ఇంజినీర్లు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగం అధికారులు జల మండలికి చెల్లించాల్సిన వాటర్ బిల్లులు, కొత్తగా విధించిన రూ.58 కోట్ల రెస్టోరేషన్ ఛార్జీలను ట్యాలీ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా జల మండలికి చెందిన ఆస్తుల్లో కమర్షియల్ ఆస్తులెన్ని? వాటి బకాయిలు ఏ మేరకు ఉన్నాయోనన్న విషయాన్ని కూడా లెక్కలేస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో హైదరాబాద్ సిటీలో జల మండలి ఆస్తులు, వాటి తాలుకూ చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ తదితర అంశాలను జీహెచ్ఎసీ ఫైనాన్స్ విభాగం లెక్కలు తీస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read: Election Commission: జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఓటు వేయాలంటే అది తప్పనిసరి.. ఈసీ కీలక ఆదేశాలు

Just In

01

BRS Party Surveys: అంతా ఫేక్.. మౌత్ టాక్‌తో గట్టెక్కాలని గులాబీ మాస్టర్ ప్లాన్..!

Katrina Kaif: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. సంబరాల్లో ఫ్యాన్స్

Kia Carens: కియా క్యారెన్స్‌ ఇప్పుడు CNG వెర్షన్‌లో లాంచ్‌.. మైలేజ్‌, ధర, ఫీచర్లపై ఫుల్ డీటెయిల్స్!

Pawan Kalyan: ‘ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం’.. డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..