Google Maps ( Image Source: Twitter)
జాతీయం

Google Maps: గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా.. ఈ న్యూ అప్డేట్స్ తో ఇప్పుడు డ్రైవింగ్ మరింత స్మార్ట్‌గా, సేఫ్‌గా!

Google Maps: భారత వినియోగదారుల కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ రోజు భారత్ కోసం 10 కొత్త ఫీచర్లను విడుదల చేసింది. వీటిలో ముఖ్యంగా జెమిని ఏఐ టెక్నాలజీతో డ్రైవింగ్ అనుభవం, ప్రాక్టివ్ ట్రాఫిక్ అలర్ట్స్, సేఫ్టీ నోటిఫికేషన్లు, మెట్రో టికెట్ బుకింగ్ సదుపాయం వంటి ఫీచర్లు ఉన్నాయి. అమెరికాలో ముందుగా ప్రకటించిన ఈ అప్‌డేట్స్, ఇప్పుడు భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వస్తున్నాయి.

వాయిస్ ఆధారిత డ్రైవింగ్ అనుభవం

ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మ్యాప్స్ తో నేరుగా వాయిస్ ద్వారా ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు ..

“నా రూట్‌లో వెజ్ ఆప్షన్ ఉన్న చవకైన రెస్టారెంట్ ఉందా?”
“దాని దగ్గర పార్కింగ్ ఉందా లేదా? ” ఇలా అడగొచ్చు.

ప్రాక్టివ్ లోకల్ టిప్స్ – మీ ప్రయాణానికి ముందే సజెస్ట్స్

జెమిని ఆధారంగా వచ్చిన ఈ ఫీచర్ మీ గమ్యం గురించి, దారిలో ఉన్న కొత్త ప్రదేశాల గురించి, వ్యాపారాల గురించి ముందుగానే టిప్స్ ఇస్తుంది. గత ఏడాది వచ్చిన “Inspirations” ఫీచర్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్.

Also Read: TG High Court: సిగాచీ పేలుళ్ల బాధితులపై హైకోర్టు కీలక ప్రశ్న.. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశం!

సేఫ్టీ ఫీచర్లు – ట్రాఫిక్ అలర్ట్స్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా హెచ్చరికలు

మ్యాప్స్ ఇప్పుడు యూజర్లకు Proactive Traffic Alerts అందిస్తుంది. అంటే, మీరు నావిగేషన్‌లో లేకపోయినా రోడ్ క్లోజర్స్, ట్రాఫిక్ జామ్‌లు, డిలేలు వంటి సమాచారం వస్తుంది. ఈ ఫీచర్ మొదట బెంగళూరు, ఢిల్లీ, ముంబైలో అందుబాటులోకి రానుంది. ఇక, Accident-Prone Area Alerts ఫీచర్ ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో డ్రైవింగ్ చేస్తే గూగుల్ మీకు ముందుగానే హెచ్చరిస్తుంది. అలాగే, కొత్త Authoritative Speed Limit Display ద్వారా ప్రతి రోడ్‌లో ఉన్న అధికారిక స్పీడ్ లిమిట్ స్క్రీన్ కింద స్పీడోమీటర్ పక్కన కనిపిస్తుంది.

మెట్రో టికెట్ బుకింగ్ కూడా మ్యాప్స్ లోనే!

ఇకపై మెట్రో టికెట్ కొనడానికి వేరే యాప్ అవసరం లేదు. మ్యాప్స్ నుంచే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం ఢిల్లీ, బెంగళూరు, కోచ్చి, చెన్నై నగరాల్లో అందుబాటులో ఉంది. త్వరలో ముంబైలో కూడా రానుంది. టికెట్లు నేరుగా గూగుల్ వ్యాలెట్  సేవ్ చేసుకోవచ్చు.

Also Read:  Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్

కొత్త ఫీచర్లు – ఫ్లైఓవర్ నావిగేషన్, బైక్ అవతార్స్

ఫ్లై ఓవర్ నేవిగేషన్లో ఇప్పుడు వాయిస్ గైడెన్స్ సపోర్ట్ కూడా వచ్చింది. స్క్రీన్ చూడకుండా మ్యాప్స్ మీకు ఏ ఫ్లైఓవర్ ఎక్కాలో, దిగి మళ్లీ ఎక్కడ టర్న్ అవ్వాలో కూడా చెబుతుంది. ఇక చివరగా, భారత యూజర్ల కోసం ప్రత్యేకంగా 2-Wheeler Avatars ఫీచర్ కూడా వచ్చింది. ఇందులో మీకు నచ్చిన బైక్ ఐకాన్‌ని సెలెక్ట్ చేసుకుని, మీ ఇష్టమైన కలర్ తో  కస్టమైజ్ చేసుకోవచ్చు.

Just In

01

Vishwak Sen Funky: విశ్వక్ నవ్వుల తుఫాను ‘ఫంకీ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

Election Commission: జూబ్లీహిల్స్ బైపోల్స్.. ఓటు వేయాలంటే అది తప్పనిసరి.. ఈసీ కీలక ఆదేశాలు

India vs Australia: నాలుగో టీ20లో టీమిండియా మోస్తరు స్కోర్.. గెలుస్తారో, లేదో?

Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?

KodamaSimham re release: మెగాస్టార్ ‘కొదమసింహం’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?