mitramanadali( Image :X)
ఎంటర్‌టైన్మెంట్

Mithra Mandali OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మిత్రమండలి.. నెల కాకముందే..

Mithra Mandali OTT: తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు ఒక కొత్త ట్విస్ట్‌తో వచ్చేసింది ‘మిత్రమండలి’. అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలై, మిశ్రమ ప్రతిస్పందనలతో ముగిసిన ఈ చిత్రం, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. థియేటర్ రన్ 28 రోజులు ముగిసిన తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి సినిమాలు. కానీ ఈ సినిమా కేవలం 21 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. సాధారణంగా చాలా సినిమాలు మూడు నుంచి నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు వెళ్తాయి కదా? కానీ ‘మిత్రమండలి’ సైలెంట్‌గా, ఎట్టి హైప్ లేకుండా ప్రైమ్ వీడియోలో డిబ్యూ చేసింది. ఇది కేవలం రిలీజ్ మాత్రమే కాదు, ఒక ‘రీ-ఎడిటెడ్’ వెర్షన్‌తో వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకులు దీన్ని ‘ఫ్రెష్ లుక్‌తో కొత్త ఫీల్’ ఉంటుందని మూవీ టీం చెబుతోంది.

Read also-Thalaivar 173: ‘తలైవాన్173’ కోసం మళ్లీ కలిసిన రజనీకాంత్, కమల్ హాసన్.. దర్శకుడు ఎవరంటే?..

ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ బడ్డీ కామెడీని రాగ్ మయూర్ డైరెక్టర్ చేశారు. కథ స్నేహితులు, రొమాన్స్, కొంచెం కాన్ఫ్యూజన్‌ల మధ్య తిరుగుతుంది. వెన్నెల కిషోర్, సత్య, బన్నీ వాస్ వంటి కామెడీ కింగ్స్ కూడా ఫుల్ ఫైర్‌తో వచ్చారు. థియేటర్ రివ్యూల్లో మిశ్రమ అభిప్రాయాలు వచ్చాయి. కొందరు ‘ఫన్ మూమెంట్స్ బాగున్నాయి’ అన్నారు, మరికొందరు ‘స్క్రిప్ట్ థిన్‌గా ఉంది, డ్రాగ్ అయింది’ అన్నారు. ఓవరాల్, బాక్సాఫీస్ వద్ద డిస్అపాయింట్‌మెంట్. కానీ, డైరెక్టర్ రాగ్ మయూర్ తన టీమ్‌తో కలిసి ఓటీటీ కోసం చిత్రాన్ని ట్రిమ్ చేసి, షార్ప్‌గా, ఫన్నీగా మార్చారు. ఇప్పుడు రన్‌టైమ్ కూడా 138 నిమిషాలకు తగ్గింది. ఇది ప్రేక్షకులకు ‘బ్రాండ్ న్యూ వెర్షన్’ లాగా అనిపిస్తోంది. ఈ రీ ఎడిటెడ్ వెర్షన్ చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Read also-Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగులో మాత్రమే అందుబాటులో ఉంది. U/A సర్టిఫికేషన్‌తో. థియేటర్ ఫ్లాప్ తర్వాత ఈ రీ-కట్ వెర్షన్ ఓటీటీలో ఎలా పని చేస్తుంది? అనేది ప్రశ్న. కానీ, ప్రియదర్శి తన సోషల్ మీడియా పోస్ట్‌లో “వీ లాఫ్డ్, వీ లెర్న్ట్, వీ రీకట్” అంటూ ఫన్నీగా ప్రమోట్ చేశారు. నిహారిక కూడా టీజర్‌లతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. థియేటర్‌లో మిస్ అయినవారు ఇప్పుడు హోమ్‌లో కుటుంబంతో చూసి ఎంజాయ్ చేయాలని మేకర్స్ సూచిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చింది రీ కట్ వర్షన్ కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి మరి.

Just In

01

Memory Improvement: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన హెల్త్ టిప్స్

Hydraa: నాటి నిందలే నేటి ఫలితాలు.. హైడ్రాకు జనం నీరాజనాలు

Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!

Air Purifier: రూ.20,000 లోపు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లు.. కొనుగోలు చేసేముందు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే!

Heroes turned villains: టాలీవుడ్‌లో హీరోలుగా పరిచయమై విలన్లుగా మారిన నటులు ఎవరో తెలుసా..