War Between Fans Of Cricketers : ఐపీఎల్ సీజన్ మార్చి 22న స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్‌కు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లందరూ క్రికెట్ పిచ్‌లో కఠోర శ్రమని కొనసాగిస్తున్నారు. కాస్త లేట్‌గా ముంబై ఇండియన్స్ గూటికి చేరుకున్న రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. డిఫెన్స్, పుల్ షాట్లతో హిట్ మ్యాన్ అలరించాడు.హిట్ మ్యాన్ ప్రాక్టీస్ స్టార్ చేసిన వెంటనే హార్దిక్ పాండ్య ట్విటర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హార్దిక్‌ను టార్గెట్‌గా చేసుకుని కొందరు రోహిత్ ఫ్యాన్స్ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.
ఈ పోస్ట్‌లు ఎలా ఉన్నాయంటే.. ఇరువురు కూడా వారి వారి హద్దులను అతిక్రమించి మరి పరస్పరం పోస్ట్‌లతో దాడులు చేసుకుంటున్నారు ఈ క్రమంలో.. ‘RIP హార్దిక్ పాండ్య’ అంటూ ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. వేలల్లో పోస్ట్‌లు ప్రత్యక్షమవ్వడంతో రిప్ హార్దిక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాసేపటికే ట్విటర్ ట్రెండింగ్‌లో నుంచి ఆ పదాన్ని తొలగించింది.అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించడంతో ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు. నెట్టింట వేదికగా రోహిత్, హార్దిక్ ఫ్యాన్స్ మినీ వార్ కొనసాగుతోంది.
Read More: ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఎమోషనల్
ఫ్యాన్స్ ఎమోషనల్‌ని అర్థం చేసుకుంటున్నానని ఇటీవల హార్దిక్ పేర్కొన్నప్పటికీ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వదిలిపెట్టట్లేదు.అయితే రోహిత్ గురించి అడిగిన క్వచ్ఛన్‌కి బదులివ్వకుండా దాటవేసినందుకే ఇలా చేస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు.
అయితే రోహిత్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా దాటవేసినందుకే ఇలా చేస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు. సోమవారం ఓ కార్యక్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, మార్క్ బౌచర్ పాల్గొన్నారు. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు హార్దిక్ బదులిచ్చాడు.
🙂 ➡️ 😊 ➡️ 😃 ➡️ 😁#OneFamily #MumbaiIndians @ImRo45 pic.twitter.com/PtPtYBGsfc
— Mumbai Indians (@mipaltan) March 19, 2024