RCB Captain Smriti Mandhana Emotional
స్పోర్ట్స్

RCB Captain Smriti : ఆర్‌సీబీ కెప్టెన్‌ స్మృతి మంధాన ఎమోషనల్

RCB Captain Smriti Mandhana Emotional : బీసీసీఐ ప్రవేశపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఛాంపియన్‌గా రాయల్‌ ఛాలెంజ్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. దీంతో.. 27 ఏళ్ల యువకెప్టెన్‌ స్మృతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎమోషనల్ అయి మాట్లాడుతూ… ఈ ట్రావెల్‌లో మేమంతా ఎత్తుపళ్లాలను ఎన్నో చూశామని తెలిపింది.మొత్తానికి మా శ్రమ ఫలించింది.ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.

ఏం జరిగిందో ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. నేను ఈ షాక్‌ నుండి తేరుకోవడానికి ఇంకాస్త టైం పడుతుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. నేను మాత్రం చాలా గర్వంగా, గట్టిగా చెప్పగలను. ఇదంతా మా సమిష్టి కృషి ఫలితం వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎమోషనల్‌ విషయాలను పంచుకుంటున్నది బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది.

Read More:అశ్విన్‌కు అరుదైన గౌరవం, హాజరైన ప్రముఖులు

గత సీజన్ మాకెన్నో పాఠాలను, ఒడిదొడుకులను నేర్పింది. మెయిన్‌గా చెప్పాలంటే.. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్‌మెంట్ నాకు ధైర్యాన్ని కల్పిస్తూ.. అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ఈ ట్రోఫీని గెలిచాం. ఇది చాలా ఆనందనీయమైన రోజు.. మా జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్‌సీబీ ఫ్రాంఛైజీని గెలవడం నిజంగా నాతో పాటుగా మా టీమ్‌ సభ్యులందరికి ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ అందరిలోకెల్లా…ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు మద్ధతుగా నిలుస్తారు. వారి మద్ధతుని ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను. ఈసారి కప్‌ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ..నా అభిమానుల కోసం ఖచ్చితంగా ఈ విషయాన్ని వారితో పంచుకోవాలంటే నేను కన్నడ భాషలో చెప్పాల్సిందేనని ఎంతో ఆనందంతో తన హ్యాపీ మూమెంట్‌ని పంచుకుంది ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన.