Tennis Player Sania Mirzas Father Clarity About Marriage To Mohd Shami: గత కొన్ని నెలలుగా భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియామీర్జా గురించి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల అనంతరం సానియా ఏ పోస్ట్ పెట్టినా, ఎక్కడికి వెళ్లినా క్రేజీ సోషల్‌మీడియాని షేక్ చేస్తూ వైరల్ న్యూస్‌గా మారుతోంది. అయితే ఇటీవల సానియా హజ్ యాత్రకు వెళ్తూ చేసిన పోస్ట్‌ను కొందరు ఇంకోలా అర్థం చేసుకున్నారు. ఈ యాత్రతో తన లైఫ్‌లో ఛేంజెస్ రావాలని ఆశిస్తున్నట్లు, బలమైన వ్యక్తిగా తిరిగొస్తానని సానియా మీర్జా పేర్కొన్నారు. అయితే కొందరు నెటిజన్లు ఇందుకు భిన్నంగా అర్థం చేసుకున్నారు.
రెండో పెళ్లికి సానియా మీర్జా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నెట్టింట చర్చ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో సానియా మీర్జాను టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. సానియా మీర్జా మహ్మద్ షమికి పెళ్లి అంటూ వార్తలు రావడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఈ వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనిపై షమి కూడా రియాక్ట్ అయ్యాడు. తన లైఫ్‌లో విన్న అతి పెద్ద రూమర్ ఇదే అంటూ పుకార్లను సున్నితంగా కొట్టిపారేశాడు.
Also Read: 2036 ఒలింపిక్ కోసం భారత్ కసరత్తు
అయితే తాజాగా ఈ విషయంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, షమీని సానియా ఇప్పటివరకు అసలు కలవలేదని క్లారిటీ ఇచ్చాడు. సానియా మీర్జా షోయబ్ మాలిక్ 2010లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటికీ షోయబ్‌కు అది రెండో పెళ్లి. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో డైవర్స్ అనంతరం సానియాను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొద్ది నెలల కిందటే ఈ జంట విడిపోయారు. కాగా పాకిస్థాన్‌కు చెందిన నటి సనా జావేద్‌ను షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. 28 ఏళ్ల సనా జావేద్‌కు ఇది రెండో వివాహం.