India To Push 2036 Olympic Pid In Paris Seek Inclusion Of Indic Sports
స్పోర్ట్స్

Olympic Game: 2036 ఒలింపిక్‌ కోసం భారత్‌ కసరత్తు

India To Push 2036 Olympic Pid In Paris Seek Inclusion Of Indic Sports: 2036లో జరగబోయే సమ్మర్ ఒలింపిక్స్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ కసరత్తులు చేస్తోంది. వచ్చే ఏడాది భారత్‌ ఆతిథ్య హక్కులపై ఓ క్లారిటీ రానుంది. అయితే ఆతిథ్య హక్కులను దక్కించుకోవడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) మిషన్ ఒలింపిక్ సెల్(ఎంవోసీ) సమగ్ర నివేదికను ఇప్పటికే రూపొందించింది. తాజాగా ఆ నివేదికను భారత కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండియాకు స్పోర్ట్స్‌ అథారిటీ అందజేసింది. ఆతిథ్య హక్కులు ఒకే అయితే 2036 ఒలింపిక్స్‌లో ఆరు నూతన క్రీడలను చేర్చాలని ఎంవోసీ ప్రతిపాదనలను రెడీ చేసింది.

అందులో యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, టీ20 క్రికెట్, స్క్వాష్ క్రీడలు ఉండనున్నాయి. ఒలింపిక్ బిడ్ రూపొందించడంలో మేము ముందున్నాం. కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో చాలా చర్చలు జరపాల్సి ఉంటుంది. భారత సంప్రదాయ క్రీడలను చేర్చడం ద్వారా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య మెరుగుపడుతుందని ఎంవోసీ సీనియర్ సభ్యుడు తెలిపారు.

Also Read: ఆ జంట విడాకులకు రెడీ అవుతోందా..?

2036 ఒలింపిక్స్‌లో చేర్చడానికి ముందు 2032 బ్రిస్టేన్ క్రీడల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఐవోసీ రూల్స్ ప్రకారం ఆతిథ్య ఒలింపిక్ కమిటీ ప్రతిపాదించిన క్రీడలు ఆతిథ్య దేశంలో ప్రసిద్ధి చెంది ఉండటంతో పాటు ఐదు ఖండాల్లో ఆ క్రీడలు ఆడాలి. ఇక 2036 ఏడాదిలో జరగబోయే ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం అన్ని దేశాల నుండి గట్టి పోటీనే ఉంది. ఈ పోటీల్లో పలు దేశాలు ఒలింపిక్‌ రేసులో పార్టీస్‌పేట్ చేయనున్నాయి.