SFI Protest: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు స్టాలిన్ ,మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసు ముట్టడించారు.
ప్రభుత్వం నుండి డబ్బులు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, గత మూడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8,150 కోట్ల వరకు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందామంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలలు, పిజి కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు రాష్ట్రంలో బందుకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ,1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసిందన్నారు.
పెద్ద ఎత్తున ఉద్యమాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని, రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యా రంగ సమస్యలపై అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్(Scholarships) ను మరియు ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్, బొచ్చు ఈశ్వర్, చెన్నూరి సాయికుమార్, మల్లేష్, ఎండి. ఇస్మాయిల్,రాకేష్ రెడ్డి, పవన్ కుమార్, అభిషేక్, అరుణ్, సందీప్, సూరజ్, రాహుల్ రణదీప్, అరుణ్ కుమార్, శేఖర్ పాల్గొన్నారు.
Also Read: Diane Ladd: వెటరన్ నటి ‘డయాన్ లాడ్’ కన్నుమూత.. చనిపోయే ముందు ఏం చెప్పారంటే?
