NC24 Meenakshi first look: నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘NC24’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మూవీ టీం. ఆ సినిమాలో హీరోయిన్ అయిన మీనాక్షి చౌధరి మొదటి లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆమె పాత్ర పేరును ‘దక్ష’గా పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నాగచైనత్య ఫ్యాన్స్‌లో భారీ బజ్‌ను సృష్టించింది. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్ చాల ఆసక్తికరంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అక్కినేని ప్యాన్స్ ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Diane Ladd: వెటరన్ నటి ‘డయాన్ లాడ్’ కన్నుమూత.. చనిపోయే ముందు ఏం చెప్పారంటే?
పోస్టర్‌లో మీనాక్షి ఒక గుహలో ఉండగా, పురాతన చిహ్నాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్‌తో పరిశీలిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఆమె గ్లాసెస్ ధరించి, ఎక్స్‌పెడిషన్ దుస్తుల్లో ఉంటూ, ఇంటెలిజెంట్‌గా, క్యూరియస్‌గా కనిపిస్తుంది. డిమ్ లైటింగ్, భూమి రంగులతో ఈ దృశ్యం మరింత మిస్టీరియస్‌గా, ఆకట్టుకునేలా ఉంది. ఈ పాత్ర ఆమెకు ఇప్పటివరకు చేసినవాటి కంటే భిన్నమైనది ఉంది. ఈ పోస్టర్ ను చూస్తుంటే.. ఈ సినిమాలో ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Read also-Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!
నాగ చైతన్య లీడ్ రోల్‌లో, మీనాక్షి చౌధరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఒక మిథాలజికల్ మిస్టరీ థ్రిల్లర్. సైన్స్, ఫెయిత్, మిస్టరీలను కలిపి చెప్పే కథ. ‘దక్ష’ పాత్ర సినిమా మెయిన్ మిస్టరీని ఆన్‌లైన్ చేసే కీలక పాత్రగా ఉంటుంది. ఆమె ఒక ఆర్కియాలజిస్ట్‌లా కనిపించేలా ఉంది, పురాతన రహస్యాలను కనుగొనేలా ఈ పాత్రను దర్శకుడు డిజైన్ చేశారు. సినెమాటోగ్రఫీ, రాహుల్ డి. హరియాన్, మ్యూజిక్ – అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇది నాగ చైతన్య-కార్తీక్ దండు కాంబినేషన్, తెలుగు సినిమా ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేస్తోంది.
Its my pleasure introducing @Meenakshiioffl as #Daksha to you all from our #NC24
It’s been such a fun time working with her and character you all will fall in love with . pic.twitter.com/LVBgRNfepV— chaitanya akkineni (@chay_akkineni) November 4, 2025
