Worlds Most Famous Places
అంతర్జాతీయం

Worlds Most Famous Places: ప్రపంచంలో చూడాల్సిన అద్భుత ప్రదేశాలు ఇవే..

 Worlds Most Famous Places: ఈ ప్రపంచంలో మనకీ తెలిసిందే కొంచమే. కానీ, మనం తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. అనేక అద్భుతాలు ఉన్నప్పటికీ, కొన్ని చారిత్రాత్మక నిర్మాణాలు మాత్రం మానవ చరిత్రలో చెరగని ముద్రలు వేసాయి. ఇవి కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, ప్రతి దేశపు సంస్కృతి, చరిత్ర, ప్రతిభకు ప్రతీకలు. ప్రపంచంలోని అద్భుత చిహ్నాలు..  ఈఫిల్ టవర్ నుంచి చైనా మహా గోడ వరకు  ఇక్కడ తెలుసుకుందాం..

ఈఫిల్ టవర్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కి చిహ్నంగా నిలిచిన ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యంత గుర్తింపుపొందిన నిర్మాణం. ఒకప్పుడు విమర్శలపాలైన ఈ “ఇనుప గోపురం” ఇప్పుడు ప్రతి పర్యాటకుడి కలల గమ్యంలాగా మారింది. టవర్‌లోని మూడు అంతస్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దాని పై నుంచి కనిపించే పారిస్‌ దృశ్యం అందర్ని మంత్రముగ్ధలు చేస్తుంది. అంతే కాదు, రాత్రి సమయంలో వెలిగే మెరుపు లైట్లు ఈ టవర్‌కి కొత్త అందాన్ని ఇస్తాయి.

Also Read: MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

న్యూయార్క్ హార్బర్‌లో నిలిచిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా గౌరవానికి ప్రతీక. 1886లో ఫ్రాన్స్‌ నుంచి బహుమతిగా అందిన ఈ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వం, ఆశలకు చిహ్నంగా నిలిచింది. “లేడీ లిబర్టీ” తల , చేతిలోని జ్యోతి వరకు వెళ్లే మెట్లు పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని ఇస్తాయి. న్యూయార్క్ బోటు టూర్స్‌లో వెళ్లే ప్రతి యాత్ర ఈ విగ్రహం వద్దగా సాగుతుంది.

గిజా పిరమిడ్లు – ప్రాచీన ప్రపంచ అద్భుతం

ఈజిప్ట్‌లోని గిజా పిరమిడ్లు మానవ సృష్టిలో అతి పురాతన అద్భుతాలు. దాదాపు 4,500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పిరమిడ్లు నేటికీ సాంకేతిక అద్భుతాలుగా నిలుస్తున్నాయి. అందులోని అతిపెద్దది ఖుఫు పిరమిడ్, ఒకప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణం. ఈజిప్ట్‌కి వెళ్ళే పర్యాటకులందరూ తప్పక చూస్తారు. అయితే, వీటిని ఏ విధంగా నిర్మించారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.

Also Read: Deputy CM Bhatti Vikramarka: ప్రపంచ స్థాయి కంపెనీలకు కేంద్రం హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

చైనా మహా గోడ – మానవ ప్రతిభకు ప్రతీక

చైనా మహా గోడ ప్రపంచంలోనే పొడవైన గోడగా ప్రసిద్ధి చెందింది. పర్వతాలు, ఎడారులు, అరణ్యాల మీదుగా 13,000 మైళ్లకు పైగా విస్తరించిన ఈ గోడ చైనాలోని ప్రాచీన రాజవంశాల కష్టాన్ని గుర్తు చేస్తుంది. ఇది ఒక నిరంతర గోడ కాకుండా, పలు విభాగాల కలయిక అని చెబుతారు. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా పర్యాటకులు ఈ మహాగోడను చూడటానికి వెళ్తారు.

ప్రేమకు ప్రతీకగా నిలిచిన తాజ్ మహల్

ప్రపంచంలోని ఆధునిక అద్భుతాలలో ఒకటిగా నిలిచిన తాజ్ మహల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది యమునా నది తీరాన ఆగ్రాలో ఉంది. ఈ తెల్లటి మార్బుల్ అద్భుతం, ప్రేమకు ప్రతీకగా నిలిచింది. దాదాపు 400 ఏళ్ల క్రితం మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా ఈ అద్భుతమైన సమాధిని నిర్మించాడు. సుమారు 20,000 మంది కళాకారులు, శిల్పులు కలిసి 22 ఏళ్లపాటు కృషి చేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

Just In

01

Pushpitha Laya: పని చేతకాని ప్రజాప్రతినిధులను చీరే సారే పంపిస్తాం: ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ

Manikonda firing case: మణికొండ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్… షాక్‌కు గురిచేస్తున్న సీఐ ప్రకటన

Purusha Movie: అతివల కోసం చేసే యుద్ధాలు వారితోనే చేయాల్సి వస్తే.. కాన్సెప్ట్ కొత్తగా ఉందిగా..

SFI Protest: సమస్యల పరిష్కారించాలని నాయిని రాజేందర్ రెడ్డి ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు

Shambala Movie: ‘శంబాల’ మూవీ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. ఆది సాయికుమార్