Ponguleti Srinivasa Reddy: జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లోఅవినీతి సొమ్ము
Ponguleti Srinivasa Reddy ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Political News

Ponguleti Srinivasa Reddy: జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో కాళేశ్వ‌రం అవినీతి సొమ్ముతోనే విచ్చలవిడి ప్రచారం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasa Reddy: కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అవినీతి చేసి సంపాదించిన ల‌క్ష కోట్ల‌ను బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాజ‌కీయాల్లో అడ్డ‌దారిన ఉప‌యోగిస్తోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు.  ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహ‌మ‌త్ న‌గ‌ర్ డివిజ‌న్ లో పాదయాత్ర నిర్వ‌హించారు.ఎస్. పీ.ఆర్. హిల్స్ నుంచి జెండాకట్ట‌, కార్మిక‌న‌గ‌ర్‌, వినాయ‌క‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆయ‌న ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వ‌హించి కాంగ్రెస్ అభ్య‌ర్ది న‌వీన్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం కమిషన్లతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ ప్రయత్నిస్తోంద‌న్నారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: ఇరుకు స్థలాల సమస్యకు పరిష్కారం.. పట్టణ పేదలకు పొంగులేటి తీపికబురు

బీఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతుంది 

ఆ అవినీతి సొమ్ముతోనే బీఆర్ఎస్ విచ్చలవిడి ప్రచారం చేస్తోంద‌ని ఆరోపించారు. 500 రోజుల్లో ప్రభుత్వాన్ని ఏమైనా జ‌ర‌గొచ్చునంటూ కేటీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ ,రెండు సంవత్సరాలు పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 500 రోజుల్లో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని ప్ర‌శ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ అవినీతి సొమ్ము ఏరులై పారుతుంద‌ని, ఓడిపోతామ‌ని తెలిసి ఆపార్టీ నాయ‌కులు అవాకులు చ‌వాకులు పేలుతున్నార‌ని అన్నారు. విజ్ఞ‌లైన ఈ ప్రాంత ఓట‌ర్లు గ‌త ప‌దేళ్ల‌లో ఆ నాటి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు , ఈ ప్రాంతానికి ఏమి చేసిందో గ‌మ‌నించి ఉచిత బ‌స్సు మొద‌లు కొని ఎన్నోసంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తున్న కాంగ్రెస్ అభ్య‌ర్ది న‌వీన్ యాద‌వ్ ను మంచి మెజార్టీతో గెలిపించాల‌న్నారు.

గ్రామీణ ప్ర‌జ‌ల‌పై దృష్టి సారించాం

ప‌దేళ్లలో చేయ‌ని అభివృద్ది ఇప్పుడు భారాసా వ‌ల‌న ఏమి జ‌రుగుతుంద‌ని ప్ర‌శ్నించారు. మీ గ‌ల్లీల్లోకి వ‌చ్చే భారాసా నాయ‌కులను ఇంత‌వ‌ర‌కు ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ ప్ర‌శ్నించాల‌ని మంత్రిగారు ప్ర‌జ‌ల‌ను కోరారు.ఈ మూడేళ్లే గాక మ‌రో ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే ఉంటుంద‌ని, పేదోళ్ల క‌న్నీరు తుడిచేవ‌ర‌కు కాంగ్రెస్ విశ్ర‌మించ‌ద‌ని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి తాము ఇంత‌వ‌ర‌కు గ్రామీణ ప్ర‌జ‌ల‌పై దృష్టి సారించామ‌ని ఇక‌పై పట్ట‌ణ పేద‌ల‌కు ఇండ్లు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: ‘మాది గేదెలాంటి ప్రభుత్వం’.. మంత్రి పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు

Just In

01

Train Hits Elephants: రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని 8 ఏనుగులు మృతి.. ఘోర ప్రమాదం

Villages Development: పల్లెల అభివృద్ధి ఎవరి చేతుల్లో? గ్రామాభివృద్ధిపై నూతన పాలకవర్గాల ఫోకస్!

Bigg Boss9 Telugu: బిగ్ బాస్ 9 హౌస్‌లోకి ‘మిస్సమ్మ’ జోడీ.. శివాజీ, లయల సందడి మామూలుగా లేదుగా..

Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన

Telangana BJP: మోదీ చివాట్లతో బీజేపీ నేతల్లో మార్పు.. డిన్నర్ మీటింగ్ వెనుక రహస్యం అదేనా?