Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో రైతును రాజును చేయాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నెలకొండపల్లి మండలం ముజ్జిగూడెం గ్రామం నుండి గువ్వల గూడెం వరకు రూ.2.60 కోట్లు అంచనా వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి, పైనంపల్లి గ్రామంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి మంత్రి శ్రీకారం చుట్టారు.
అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… రాష్ట్రంలో పేదలకు సొంత ఇల్లు ఇవ్వడం, ప్రతి అల్లుడికి రేషన్ కార్డు అందించడం ఇందిరమ్మ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందని వివరించారు. అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా తగ్గనీయకుండా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించామని పేర్కొన్నారు.
Also Read: Dinosaur Condom: అమ్మబాబోయ్.. పురాతన కండోమ్ అవశేషాలు.. డైనోసార్ వాడిందని టాక్!
దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితిని మార్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని వివరించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదమే ప్రభుత్వానికి బలం కావాలన్నారు. పాలిచ్చే గేదె లాంటి ఈ ప్రభుత్వం ప్రజల దీవెనతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
