Earth Without Humans: ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. అలాగే, మనకి తెలియని ఎన్నో ప్రపంచ వింతలు కూడా ఉన్నాయి. వాటిని మనం తెలుసుకున్నప్పుడు నిజంగా ఇలా జరుగుతుందా ? అని అనిపిస్తుంది. అలా భూమి మీద ఉన్న మనుషులు ఒక్కసారిగా మాయమైపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
భూమి మీద ఉన్న మనుషులు మాయమైతే.. అలా జరుగుతుందా?
మనుషులు లేకపోతే జంతువులు ఒక్కటే ప్రశాంతంగా బతుకుతాయా? లేదా భూమి ఇప్పుడున్న దాని కంటే, దారుణంగా తయారవుతుందా? అనేది ఇక్కడ తెలుసుకుందాం..
మనుషులు ఒక్కసారిగా మాయమైతే గాల్లో ఉన్న విమానాలు అన్ని ఒక్కసారిగా సముద్రాల్లో, భూమి పై పడతాయి. అలాగే, కార్లు, రైళ్ళు అన్ని యాక్సిడెంట్ కు గురవుతాయి. కొన్ని గంటల తర్వాత భూమి పై నున్న కరెంట్ మొత్తం ఆగిపోతుంది. పవర్ మొత్తం పోయాక ఇంటర్నెట్ కూడా ఉండదు. ఐదు రోజుల తర్వాత మనుషులు పెంచుకున్న పెంపుడు జంతువులు దాహంతో , ఆకలితో చనిపోతాయి. కానీ, అడవులలో ఉండే జంతువులు మాత్రం మంచిగా బతుకుతాయి. ఒక నెల తర్వాత ప్రపంచంలోని అన్ని న్యూక్లియర్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతాయి. దాని వలన పెద్ద మొత్తంలో రేడియోషన్ గాల్లోకి వెళ్ళిపోతుంది. ఇంటర్నెట్ స్పెస్ స్టేషన్స్, శాటిలైట్స్ కొన్నేళ్ల తర్వాత భూమి మీద పడి పోతాయి. అలాగే, మానవుల చేతులతో నిర్మించిబడిన ప్రతిదీ నాశనం అవుతుంది. ఇలా ఉన్న పలంగా మనుషులు భూమి మీద మాయమైతే ఈ విధంగా జరుగుతుంది.
