Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కుమారుడు సూర్య సేతుపతి (Surya Sethupathi) హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఫీనిక్స్’ (Phoenix). స్టంట్ మాస్టర్ అనల్ అరసు (Anal Arasu) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మి అనల్ అరసు నిర్మించారు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలైన మంచి సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి కూడా హాజరయ్యారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని అతిథిగా పాల్గొన్నారు.
Also Read- Sreeleela: శ్రీలీలకు హిట్టొచ్చేది ఎప్పుడు? ఇక ఆశలన్నీ ఆ సినిమాపైనే!
యాక్షన్ అంటే అంత ఇష్టం
ఈ వేడుకలో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన గోపీచంద్‌కు థాంక్యూ. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నేను ‘జవాన్’ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్‌ను కలిశాను. అప్పుడే నాకు ఆయన ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటిస్తే బాగుంటుందని అన్నారు. మీ ఇద్దరే మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకు వారేం చెప్పలేదు. వాళ్ళిద్దరే మా వాడితో మాట్లాడుకున్నారు. అంతా కలిసి సినిమా చేశారు. ‘ఫీనిక్స్’ సినిమాను నేను చూశాను. నాకు నచ్చింది. ఇది మా అబ్బాయికి మంచి ఆరంభమని నేను భావిస్తున్నాను. ఒక తండ్రిగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలు చేయాలని ఉండేది. తనకి యాక్షన్ అంటే అంత ఇష్టం. నన్ను యాక్షన్ సినిమాలు చేయమని ఎప్పుడూ చెప్తుండేవాడు. యాక్షన్ సినిమా వస్తే.. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటి సినిమాలు చేయడం తన డ్రీమ్. ఒకరోజు నా దగ్గరకు వచ్చి యాక్టర్ అవుతానని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేసేశాడు. అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజ్యలక్ష్మి మేడమ్ వల్లే సాధ్యమైంది.
Also Read- Bigg Boss Telugu 9: తనూజ ఏం మారలే.. అవే అరుపులు.. నిజంగా బిగ్ బాస్ సపోర్ట్ ఉందా?
కొంచెం అడ్జస్ట్ అవ్వండి
ఈ సినిమాకు తెలుగులో డైలాగ్స్ రాసిన భాష్యశ్రీకి థాంక్స్. నేను ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పూర్తయ్యేలోగా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతాను. ఇంకా కవితలు కూడా రాస్తాను. అప్పటివరకు నా తెలుగును కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వరలక్ష్మి, నేను చాలా మంచి ఫ్రెండ్స్. తనకి ఎప్పుడూ హై ఎనర్జీ ఉంటుంది. సినిమా ఏ భాషలో ఉన్నా.. అందులో ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరూ సినిమాని సెలబ్రేట్ చేస్తారు. అందుకే అన్ని భాషలు సినిమాలను మనం చూస్తాం. ‘ఫీనిక్స్’ విషయంలో కూడా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇందులో యాక్షన్, ఎమోషన్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్‌లో కలుద్దామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
