Kandikonda Jathara ( image credit: swetcha repoter)
నార్త్ తెలంగాణ

Kandikonda Jathara: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు సిద్ధమైన కందికొండ.. వేలాది భక్తులతో సందడి.. ప్రత్యేకత మీకు తెలుసా?

Kandikonda Jathara: కందికొండ జాతర కార్తీక పౌర్ణమికి ప్రత్యేక శోభనిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోని కందకొండ జాతర రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన గొప్ప ప్రకృతి ఆలయం. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజు కందగిరి గుట్టపై వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవోపేతంగా నిర్వహిస్తారు. కందగిరి పర్వతంపై తొలుత నాచురల్ గా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తొలుత పూజలు నిర్వహిస్తారు. ఆపైన కొండ శిఖరం పై ఉన్న నరసింహ స్వామి దేవాలయంలో భక్తులు విశేషంగా పూజలు చేస్తారు. నరసింహస్వామి ఆలయ దర్శనానికి ముందు ఆలయ ప్రాంగణ కింది భాగంలో కోనేరు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవుని కొలిచేందుకు ఆలయానికి వెళతారు. ఈ కోనేరులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు దూరం అవుతాయని భక్తుల్లో నమ్మకం నెలకొంది. కార్తీక పౌర్ణమి నాడు భక్తులు సంభ్రమాశ్చర్యాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం, అఖండ దీపం వెలుగు కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఈ జాతరకు పూర్వపు వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేసి దర్శనం చేసుకుంటారు.

Also ReadMass Jathara Teaser: ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేసింది.. చూశారా..

కందగిరి పర్వతం ప్రకృతి దృశ్యాలకు నిలయం

కార్తీక పౌర్ణమి వర్షాకాలం చివరి దశలో చలికాలం ప్రారంభ దశలో కందగిరి పర్వతం పై పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈ సమయంలో పర్వతమంత పచ్చని ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తూ పర్యాటకులకు, భక్తులకు అందమైన కొండ ప్రాంతంగా ఆహ్లాదకరాన్ని పంచుతుంది. కార్తీక పౌర్ణమి రోజున ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ భక్తుల దర్శనానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. కొండ మొదటి అడుగు నుంచి శిఖరం పై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనం పూర్తయ్యే వరకు భక్తులు కాలినడకని వెళుతుంటారు. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా కందగిరి పర్వతాన్ని అధిరోహించడానికి సంసిద్ధులవుతారు. కందగిరి పర్వతంపైనే ఆలయం ఉండడంతో భక్తులు గుంపులు గుంపులుగా నడక సాగిస్తూ దర్శనం చేసుకునేందుకు మక్కువ చూపుతారు.

కందగిరి జాతర నేపథ్యం

మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం కందికొండ గ్రామ సమీపంలో కందగిరి పర్వతంపై మద్యస్థ భాగంలో వెంకటేశ్వర స్వామి, ఆలయ శిఖర అగ్ర భాగాన నరసింహ స్వామి ఇలవేల్పులై భక్తులకు దర్శనం ఇస్తారు. 25 ఏళ్ల క్రితం హిరణ్యకశకుని సంహారం, నరసింహస్వామి లక్ష్మీదేవితో భూమిపై సందర్శన చేసినట్లుగా ధార్మిక విశ్వాసాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గతంలో యుద్ధ మందుకుపై దాచుకునేందుకు మందుల కొట్టు కూడా ఉందని నానుడి. ఈ ప్రాంతమంతా భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. గుట్ట పైకి భక్తులు ఎక్కడానికి రెండు మార్గాలు ఉంటాయి. వీటిలో ఒక యాత్ర వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చేరుతుంది. మరో మార్గం నుంచి పర్వత శిఖరం అగ్రభాగంలో ఉన్న నరసింహ స్వామి దర్శనానికి నేరుగా చేరవేస్తుంది.

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

కురవి మండలంలోని కందికొండ గ్రామ సమీపంలో ఉన్న కందగిరి జాతరకు ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఈ జాతర కు ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకొస్తారు. ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ స్తంభించకుండా అడుగడుగున అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. భక్తులకు సౌకర్యాల పరంగా అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తుంటారు. జాతర సమయంలో స్థానిక ప్రజలు, భక్తులు తమ ఇళ్ళ ముందు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మొత్తం మీద కందికొండ జాతర రెండు దశాబ్దాలుగా కార్తీక పౌర్ణమి రోజున కార్తీక శోభను సంతరించుకుంటుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆరాధనకు సంబంధించిన ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. నవంబర్ 5వ తేదీన జరిగే ఈ జాతరకు ధార్మిక విశ్వాసంతో పాటు ప్రకృతి ప్రేమకు మైలురాయిగా కందగిరి పర్వతం నిలిచింది.

Also ReadKhammam District: కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం.. ఎక్కడంటే?

Just In

01

Dheeraj Mogilineni: వేస్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌పై ‘ది గర్ల్ ‌ఫ్రెండ్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!

Prabhas: ప్రశాంత్ వర్మతో ప్రభాస్ చేయాల్సిన ‘బ్రహ్మరాక్షస్’ డౌటేనా?

Bigg Boss Buzzz: మాధురిపై శివాజీ కౌంటర్స్ చూశారా? ఇది వేరే లెవల్ అంతే..!

TPCC: జూబ్లీహిల్స్‌లో టీపీసీసీ ‘ఉమెన్స్ వ్యూహం’.. రంగంలోకి 7 మహిళా బృందాలు.. ఏం చేస్తాయంటే?

RT76: ఆషికాతో రొమాన్స్‌లో రవితేజ.. షూటింగ్ అప్డేట్ ఇదే!