Seethakka: తెలంగాణ మహిళా మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు వెళ్లారు. తాజాగా నెదర్లాండ్ (Netherland) దేశంలో మంత్రి సీతక్క (Seethakka) పర్యటించారు. ఈ సందర్భంగా నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం లభించింది. ఆమ్ స్టర్ డమ్ విమానాశ్రయంలో టీపీసీసీ ఎన్ఆర్ఎ సెల్ సభ్యులు మంత్రి సీతక్కను ఆత్మీయంగా ఆహ్వానించారు. నెదర్లాండ్ దేశంలోని స్త్రీ, శిశు సంక్షేమ రంగంలో అమలవుతున్న పథకాలను పర్యవేక్షించేందుకు ఆ దేశానికి వెళ్లారు మంత్రి సీతక్క. అంతేకాదు స్త్రీ అలాగే శిశు సంక్షేమ రంగంలో భాగంగా అమలు అవుతున్న పలు కార్యక్రమాలను కూడా పర్యవేక్షించనున్నారు.
Also Read: Seethakka: అంగన్వాడీ నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలి.. అధికారులకు మంత్రి సీతక్కఆదేశం!
అమలు చేసే దిశగా అడుగులు
నెదర్లాండ్ దేశంలో అమలవుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రెండు రోజుల పాటు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై మహిళా సంక్షేమం అలా శిశు అభివృద్ధి రంగాల్లో భాగస్వామ్య అవకాశాలను కూడా ఈ సందర్భంగా మంత్రి సీతక్క పరిశీలిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి సీతక్క విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే నెదర్లాండ్ లో పర్యటించిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం అయితే లభించింది.
ప్రజలు ఘన స్వాగతం
అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలతో పాటు తెలుగు ప్రజలు కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్, సన్న బియ్యం, తక్కువ ధరకే గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక ఇప్పుడు స్త్రీ, శిశు సంక్షేమ రంగంపై దృష్టి సారించింది సర్కార్.
Also Read: Seethakka: కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవాలి.. సీతక్క కీలక వ్యాఖ్యలు
