Rajasekhar: యాంగ్రీమ్యాన్ డాక్టర్ రాజశేఖర్ (Angry Man Rajasekhar) తాజాగా ‘బైకర్’ సినిమా గ్లింప్స్ (Biker Movie Glimpse) లాంచ్ వేడుకలో పాల్గొని, తన వ్యక్తిగత ఆరోగ్య సమస్య గురించి బహిరంగంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి, ఆవేదనకు గురి చేశారు. ఒక డాక్టర్‌గా ఉంటూనే, తాను చాలా కాలంగా ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన ఓపెన్‌గా చెప్పడం వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా గ్యాప్ తర్వాత ఆయన ‘బైకర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చాలా బాగుంటుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరిన రాజశేఖర్ తన వ్యాధితో బాధపడుతున్నానని, ఈ వేడుకకు రావాలని దర్శకుడు పిలిచినప్పుడు, చాలా భయంభయంగానే వచ్చానని చెప్పారు. ఇంతకీ రాజశేఖర్ ఏ వ్యాధితో బాధపడుతున్నారంటే..
Also Read- Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?
‘ఇరిటబుల్ బౌట్ సిండ్రోమ్’తో పోరాటం
ఈ వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ.. తాను చాలా రోజులుగా ‘ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS)’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా తలెత్తే ఇబ్బందులను ఆయన స్వయంగా వివరించారు. ఈ వ్యాధి ఉన్నవారికి కంగారు పెరిగిపోవడం, కడుపు పాడైపోవడం, కడుపు నొప్పి, ఉబ్బరం, విరోచనాలు, మలబద్ధకం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఈ వ్యాధితో పాటు తనకు కోపం కూడా ఎక్కువగా వస్తుందని, ఇలాంటి లక్షణాలు వేదికపైకి రాకముందు కూడా తనను ఇబ్బంది పెట్టాయని ఆయన చెప్పారు. ఈ వేడుకకు రావాలని దర్శకుడు చెప్పినప్పుడు, తన అనారోగ్య పరిస్థితి కారణంగా తాను ఎలా హాజరు కావాలా? అని ఆలోచించానని రాజశేఖర్ తెలిపారు. ‘ఇలాంటి లక్షణాలతో ఈ వేడుకకు వచ్చి, ఏదో ఒకటి మాట్లాడి ఈవెంట్‌ని ఎక్కడ నాశనం చేస్తానో’ అనే భయంతో వచ్చానని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.
కరోనా తర్వాత మరింత ఇబ్బంది
కరోనా వచ్చిన సమయంలో కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని, ఆ తర్వాతే ఈ ఆరోగ్య సమస్య మరింతగా ఇబ్బంది పెడుతుందని ఆయన తెలిపారు. బహిరంగ వేదికపై ఒక స్టార్ హీరో, డాక్టర్ అయ్యుండి కూడా తన ఆరోగ్య సమస్యల గురించి ఇంత నిజాయితీగా మాట్లాడటంపై పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా ఈ సమస్య నుంచి కోలుకోవాలని, మళ్లీ ఎప్పటిలానే నటుడిగా బిజీ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ‘బైకర్’ మూవీలో శర్వానంద్ (Sharwanand) హీరోగా నటిస్తుండగా, అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
