Sudheer Babu: టాలీవుడ్‌లో నెపోటిజంపై చర్చ మళ్లీ జోరందుకుంది. దీనికి కారణం, హీరో సుధీర్ బాబు (Sudheer Babu) ఇటీవల తన తాజా చిత్రం ‘జటాధర’ (Jatadhara) ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే. తన 20 సినిమాల ప్రయాణం వెనుక ఉన్న కష్టం, మహేష్ బాబు (Mahesh Babu) సపోర్ట్ తీసుకోకపోవడం వంటి విషయాలను సుధీర్ బాబు బహిరంగంగా వెల్లడించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ‘ఓపెన్ స్పీచ్’ వెనుక పెద్ద ‘స్కెచ్’ ఉన్నట్లుగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘జటాధర’ వేదికపై సుధీర్ బాబు మాట్లాడుతూ.. తన ప్రయాణంలో తాను పడిన కష్టాన్ని స్పష్టం చేశారు. “ఇప్పటివరకు నేను 20 సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో నాకు వచ్చిన విజయం వెనుక కారణం నా కష్టమే. అలాగే, అపజయం కూడా నా ఫెయిల్యూరే. నేను ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్‌ని అయినప్పటికీ, మహేష్ బాబు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా… ఏ ఒక్క రోజు కూడా హెల్ప్ చేయమని అడగలేదు’’ అని తెలిపారు.
Also Read- Mohan Babu: ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. గ్రాండ్ ఈవెంట్ ఎప్పుడంటే?
వ్యూహాత్మక అడుగు
అంతేకాకుండా, తాను ఏ నిర్మాతను కూడా ఒక్క రూపాయి ఎక్కువ అడగలేదని, కథకు అనవసరంగా ఫైట్ లేదా డ్యాన్స్ సీక్వెన్స్‌లు పెట్టమని కోరలేదని తేల్చి చెప్పారు. ‘‘కృష్ణ (Super Star Krishna) గారి అల్లుడు, మహేష్ గారి బావ.. సుధీర్ బాబు’’ అన్న గుర్తింపు ఉన్నప్పటికీ, తన ప్రయాణం స్వయంకృషితోనే సాగిందని చెప్పడం ద్వారా, నెపోకిడ్ అనే విమర్శలకు గట్టి సమాధానం ఇవ్వాలని ఆయన ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. సుధీర్ బాబు ఇంతగా మనసు విప్పి మాట్లాడటానికి కారణం కేవలం ‘జటాధర’ మూవీ కాదని, రాబోయే రోజుల్లో ఆయన తన కుమారులను సినీ రంగంలోకి తీసుకురావడానికి వేసిన వ్యూహాత్మక అడుగుగా ఇండస్ట్రీ పండితులు భావిస్తున్నారు.
Also Read- Bigg Boss Telugu 9: నేషనల్ క్రష్మిక ఎంట్రీ.. తనూజకు తలంటేసిన నాగ్.. గోల్డెన్ బజర్ ట్విస్ట్!
భవిష్యత్తు కోసం వేసిన అడుగు?
ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, తన బిడ్డలు ఎంట్రీ ఇచ్చే సమయంలో వారిపై ‘ఘట్టమనేని బ్యాక్‌గ్రౌండ్’ ముద్ర బలంగా పడకుండా, వారికి స్వతంత్రంగా నిలబడే రూట్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సుధీర్ ఉన్నారని తెలుస్తోంది. తండ్రిగా తన అనుభవాలను ముందుగా పంచుకోవడం ద్వారా, తాను ‘సపోర్ట్ తీసుకోలేదు, నా కాళ్లపై నేను నిలబడ్డాను’ అని బలంగా చెప్పగలిగితే, భవిష్యత్తులో తన పిల్లలపై నెపోటిజం విమర్శల ప్రభావం తగ్గుతుందని ఆయన ఆశించి ఉండొచ్చు. సుధీర్ బాబు స్పీచ్‌లోని నిజాయితీని మెచ్చుకుంటూనే, తన కుటుంబ వారసుల కోసం ఆయన వేసిన ఈ ముందుచూపుతో కూడిన అడుగు, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్య ద్వారా సుధీర్ బాబు తనకు ఈ ఇమేజ్‌ను స్వయంకృషితో వచ్చిందనే విషయాన్ని బలంగా ప్రేక్షకులలోకి తీసుకెళ్లగలిగారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
