Gundu-Sudha-Rani (Image source Twitter)
నార్త్ తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Warangal floods: వరద ప్రాంతాల్లో వరంగల్ కలెక్టర్ పర్యటన.. బాధితులకు కీలక హామీ

Warangal floods: వరద ప్రభావిత బాధితులకు అన్ని విధాల సహకారం అందిస్తాం

నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి హామీ

కమిషనర్‌తో కలిసి వరంగల్‌లోని వివిధ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన

వరంగల్, స్వేచ్ఛ: వరద ప్రభావిత బాధితులకు అన్ని విధాల సహకారం అందిస్తామని నగర మేయర్ గుండు సుధారాణి భరోసా ఇచ్చారు. ఆదివారం వరంగల్ పరిధిలో (Warangal floods) వరద ప్రభావానికి గురైన ఎన్టీఆర్ కాలనీ, రామన్నపేట, సంతోషిమాత కాలనీ ఫేజ్ 1 ,ఫేజ్ 2 గంగ పుత్ర కాలనీ ప్రాంతాలతో పాటు డీఆర్ నగర్, ఎస్ఆర్ఆర్ తోట ప్రాంతాలలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.  సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వరదల వల్ల నష్టపోయిన ఇళ్లను గుర్తించి సంబంధిత సమాచారాన్ని నమోదు చేస్తామన్నారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన బురదతో పాటు చెత్తాచెదారం తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కొనసాగుతున్న అసెస్మెంట్‌ను మేయర్ కమిషనర్ ఇరువురు పరిశీలించారు.

Read Also- Film stars in politics: సినిమాల్లో పాపులర్ అయితే రాజకీయాల్లో రాణించవచ్చా.. అలా ఎంత మంది సక్సెస్ అయ్యారు..

వార్డు ఆఫీసర్లు రెవెన్యూ సిబ్బంది జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి అంచనా వేసి వాస్తవ సమాచారాన్ని అందజేయాలని వరంగల్ ప్రాంతంలో 5 జే సిబి లు హన్మకొండ ప్రాంతం లో 6 జేసీబీ లు, ట్రాక్టర్ ల సహాయంతో వరద వల్ల ఏర్పడిన బురదను తొలగించడం జరుగుతుందని అన్నారు. హన్మకొండ ప్రాంతం లోని ప్రగతి నగర్ వివేక నగర్ కాలనీ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ వరద ముంపుకు గురైన ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి మాట్లాడుతూ వరద ప్రభావం తో ఏర్పడ్డ బురద వ్యర్థాలను తొలగించడానికి 3 జే సి బి లు హిటాచీ యంత్రాలను వినియోగించి ట్రాక్టర్ ల ద్వారా చెత్తను తొలగిస్తున్నామని ఈ సందర్భం గా మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో సీఎం‌హెచ్‌వో డా.రాజారెడ్డి. ఎంహెచ్‌వో డా.రాజేష్ శానిటరీ సూపర్ వైజర్లు గోల్కొండ శ్రీను, భాస్కర్ పాల్గొన్నారు.

హన్మకొండలో బాధితులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

వరంగల్, స్వేచ్ఛ: హన్మకొండలో తుఫాన్ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయినా రాజేందర్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తమవంతు ఆర్ధిక సహాయాన్ని వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలను పంపాలని రాజేందర్ రెడ్డి కోరారు. హన్మకొండ నగరంలో మొంథా తుఫాను కారణంగా సంభవించిన నష్టం వర్ణనాతీతమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 100కు పైగా కాలనీలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు కుటుంబాలతో సహా నీటిలో చిక్కుకుపోయిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యల్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు రాత్రింబగళ్ళు సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ, నీటి మట్టం ఎక్కువగా ఉండటం వల్ల పూర్తిస్థాయి సహాయం అందించడం కష్టంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా హన్మకొండకు చేరుకుని ముంపుకు గురైన కాలనీలను పరిశీలించి, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారని ఆయన తెలిపారు.

Read Also- India victory: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా సునాయాస విజయం

ముంపు ప్రభావిత కుటుంబాల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే, అన్ని శాఖల అధికారులను క్షేత్ర స్థాయిలో దింపి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ – హన్మకొండలో చోటుచేసుకున్న ఈ భారీ విపత్తును ప్రత్యేక దృష్టితో పరిగణించి, కేంద్ర బృందాలను పంపి నష్టాన్ని అంచనా వేసి, ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లను, ఆస్తులను కోల్పోయిన పేద ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రజలు ఈ క్లిష్ట సమయంలో ధైర్యం కోల్పోకూడదని, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అన్ని రకాల సహాయక చర్యలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కాలనీల్లోని యువత, విద్యార్థులు ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

Just In

01

Devi Sri Prasad: ఆయన నా పాటకు స్టెప్పులెయ్యాలని కోరుకునేవాడిని.. దేవీ శ్రీ ప్రసాద్

Rajasthan Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు

Womens World Cup: అమ్మాయిలూ.. ఇది విజయానికి మించి.. ఒకప్పుడు సెకండ్ గ్రేడ్ గ్రౌండ్లు కేటాయింపు.. అంతా ఎలా మారిపోయిందంటే?

Dreams: చెడు కలలు ఎందుకు వస్తాయి? శాస్త్రవేత్తలు బయటపెట్టిన నిజాలివే!

Ramchander Rao: ఒకరిది కాంట్రాక్టర్ల పాలన ఇంకొకరిది కుటుంబ పాలన.. ఇదేం విచిత్రం..!