Andhra King Taluka: ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రామ్..
andhra-king-taluka..( image: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Andhra King Taluka: ఆ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసిన రామ్ పోతినేని.. ఇక విడుదలే తరువాయి..

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ పూర్తయింది. తెలుగు సినిమా ప్రేక్షకుల మధ్యకు మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో రాబోతున్న చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పలు ప్రచార చిత్రాలు సినిమా ప్రేక్షకుడిని ఎంతగానో ఆకర్షింస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మొదటి సారి దర్శకత్వం చేస్తున్న పి. మహేష్ బాబు ఈ సినిమా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మాణంలో ఈ సినిమా భారీగా రూపొందుతోంది. ఈ చిత్రం, రామ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.

Read also-Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ఆ రికార్డులు కొట్టడం ఖాయం అంటున్న దేవీశ్రీ ప్రసాద్..

2024 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభమైన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్, ఈ రోజుతో పూర్తయింది. చిత్రం ఎక్కువ భాగం రాజమహేంద్రవరం పరిసరాల్లో చిత్రీకరించారు. ఇటీవల రాజమండ్రిలో రామ్, కన్నడ స్టార్ ఉపేంద్రలు కలిసి కీలక సీన్స్ చేశారు. హైదరాబాద్‌లోని కోకపేట్ స్టూడియోలో ఆఖరి రోజు షూటింగ్ జరిగింది. ఇక్కడ క్లైమాక్స్ సీక్వెన్స్‌లు పూర్తి చేశారు. జూలైలో హైదరాబాద్‌లో ఒక నెలకాల క్రూషియల్ షెడ్యూల్ పూర్తయ్యాక, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో ముగించారు.

ఈ చిత్రం 90 వదశకంలో ఒక హీరోను అభిమానించే యువకుడి కథ. రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, ‘ఆంధ్ర కింగ్’ అని పిలవబడే కన్నడ స్టార్ ఉపేంద్ర ఫ్యాన్‌గా కనిపిస్తాడు. చిన్న పట్టణంలో జరిగే ఈ కథలో, అభిమానం, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ అవుతాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సెతో రామ్ కెమిస్ట్రీ స్పెషల్ మార్క్. టీజర్‌లోనే రామ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అభిమాని కథలో ఫ్యాన్ బయోపిక్ టచ్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు.

Read also-Prasanth Varma: ప్రశాంత్ వర్మపై ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసిన నిర్మాత.. ఎందుకంటే?

ఇప్పటికే విడుదలైన టీజర్ ను చూస్తుంటే..ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఎప్పటిలాగే తన ఎనర్జీని ఈ సినిమాలో కూడా చూపించారు. ప్రతి సీన్ లోనూ 90ల నాట్ ఫ్యాన్స్ ఎలా ఉండేవారో అచ్చం అలాగే తన ఎమోషన్స్ ను పండించాడు రామ్ పోతినేని. హీరోయిన భాగ్యశ్రీ పాత్రకు తగ్గట్టుగా ఒదిగిపోయింది. తన క్యూట్ హావభావాలతో మరో సారి ప్రేక్షకులను మెప్పించింది. వీరిద్దరి మధ్య కాలేజీ లవ్ స్టోరీ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ప్రతి డైలాగ్ ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా ఉంది. టీజర్ తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

BSNL: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కొత్త యాప్ ప్రారంభం.. కస్టమర్ ఆన్‌బోర్డింగ్ కోసం సంచార్ మిత్ర

V.C. Sajjanar: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. ఆర్బీఐని కూడా వదలట్లే.. సజ్జనార్ బిగ్ అలర్ట్!

Government Job: ఆర్థిక ఇబ్బందులను లెక్కచేయని చదువు పోరాటం.. తల్లిదండ్రుల కలను నిజం చేసిన కుమారుడు!

Collector Hanumantha Rao: మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు.. భువనగిరి జిల్లా ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం!

Ola Electric: భవిష్ అగ్గర్వాల్ రుణ చెల్లింపు తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేర్లలో భారీ లాభాలు