Baahubali craze: ఖండాంతరాలు దాటిన బాహుబలి మేనియా..
bahu-bali-range(image ;x)
ఎంటర్‌టైన్‌మెంట్

Baahubali craze: ఖండాంతరాలు దాటిన బాహుబలి మేనియా.. ఇది చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

Baahubali craze: బాహుబలి మేనియా కేవలం ఇండియాలోని మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే భారత దేశానికి దాదాపు అయిదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్ ఆప్రికాలో చిన్న మారుమూల ప్రాంతంలో ప్రభాస్ బాహుబలి ఫ్యాన్ ఒకరు తన పచారీ కొట్టుకు బాహుబలి బొమ్మ వేయించుకున్నారు. ఏదో పనిమీద అక్కడికి వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి దానిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. బాహుబలి గురించి మాట్లాడుతూ ఇలాంటి సినిమా తీసినందుకు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్కలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. దీనిని చూసిన తర్వాత తెలుగు వాడిగా పుట్టడం చాల గర్వకారణం అని అన్నారు. బాహుబలి ఖండాంతరాలుదాటి ఎక్కడో మారు మూలన ఉన్న చిన్న గ్రామంలో ఈ ఫేయింటింగ్ ఉండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read also-Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ఆ రికార్డులు కొట్టడం ఖాయం అంటున్న దేవీశ్రీ ప్రసాద్..

పదేళ్ల క్రితం తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ సిరీస్, ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వచ్చి తన సత్తా చాటుతోంది. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రెండు భాగాలను కలిపి 3 గంటల 45 నిమిషాల నిడివితో ‘బాహుబలి: ది ఎపిక్’గా రీ-రిలీజ్ అయింది. చూసిన కథ అయినా, ఈ కట్ వెర్షన్‌లో కొత్త మ్యాజిక్ ఉంది. థియేటర్‌లో కూర్చుని చూస్తే, మళ్లీ మహిష్మతి ప్రపంచంలోకి లోతుగా మునిగిపోయినట్లు అనిపిస్తుంది.
Raed also-Mass Jathara collection: రవితేజ ‘మాస్ జాతర’ డే 1 కలేక్షన్స్ ఎంతో తెలుసా.. ఆ రికార్డు బ్రేక్..

‘బాహుబలి’ రీ-రిలీజ్ ప్రీవ్యూస్‌తో పాటు మొదటి రోజు (అక్టోబర్ 31) మొత్తం రూ.10.65 కోట్లు సేకరించింది. తెలుగు ప్రేక్షకుల మధ్య మాత్రమే కాకుండా, హిందీ, తమిళం వంటి భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా యొక్క ఎపిక్ విజువల్స్, ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్, ప్రభాస్, రానా దగ్గుపాటి, ఆనుష్క, తమన్నా వంటి స్టార్ కాస్ట్ – ఇవన్నీ మళ్లీ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాలకోసం థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ ఏ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి మరి.

Just In

01

Commissioner Sunil Dutt: జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోండి: సీపీ సునీల్ దత్

Bigg Boss Telugu 9 Winner: గ్రాండ్ ఫినాలే.. టైటిల్ పోరులో దూసుకుపోతున్న పవన్!.. విజేత ఎవరు?

GHMC: వ్యాపారస్తులకు జీహెచ్ఎంసీ అలర్ట్.. ఫ్రీ రెన్యూవల్ డెడ్‌లైన్ నేటితో క్లోజ్!

Jagan Birthday Cutout: వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం ముందు కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు

Pawan Kalyan on YCP: అధికారంలోకి వస్తాం.. చంపేస్తామంటే భయపడతామా? పవన్ మాస్ వార్నింగ్!