Vikarabad Crime: భార్య, కూతురు, వదినను గొంతుకోసి హత్య
Vikarabad Crime ( image credit: twitter)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Vikarabad Crime: భార్య, కూతురు, వదినను గొంతుకోసి హత్య.. వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన

Vikarabad Crime:  కులకచర్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్య, కూతురు, వదినను వేపూరి యాదయ్య గొంతుకోసి హత్య చేశాడు. హత్యల తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతులు అలివేలు(32), హనుమమ్మ(40) శ్రావణి(10), యాదయ్య(38)లుగా పోలీసులు గుర్తించారు. అయితే.. యాదయ్య మరో కూతురిని కూడా చంపే ప్రయత్నం చేయగా ఆమె తప్పించుకున్నట్లు సమాచారం.

Also Read: Shocking Murder: కుషాయిగూడలో దారుణం.. ఓ రియల్టర్ దారుణ హత్య!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భార్య అలివేలు, వదిన హనుమమ్మ, కూతురు శ్రావణిలను యాదయ్య కొడవలితో గొంతుకోసి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో కూతురు అపర్ణ యాదయ్య నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. రోజువారీ కూలీ పనిచేసే యాదయ్య భార్య అలివేలుపై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ.. గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారని వివరించారు.అయితే వారిద్దరిని రాజీ చేసేందుకు వచ్చిన వదిన హనుమమ్మపై అక్కడే ఉన్న పిల్లలపై యాదయ్య దాడికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. హత్యల అనంతరం యాదయ్య ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు. హత్యలకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు.
Also Read: Vizag Crime: మహిళా లెక్చరర్ల వేధింపులు.. విశాఖ విద్యార్థి సూసైడ్‌లో భారీ ట్విస్ట్.. వాట్సప్ చాట్ లీక్!

Just In

01

Double Murder

Christmas Dinner: గుడ్ న్యూస్.. ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్ డిన్నర్.. హాజరుకానున్న సీఎం రేవంత్

Nidhhi Agarwal: లూలూమాల్ ఘటనపై సీరియస్ అయిన పోలీసులు.. మాల్ యాజమాన్యంపై సుమోటో కేసు..

Minor Girl Abuse: మైనర్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. మేడ్చల్ కోర్టు సంచలన తీర్పు

Viral Video: పెళ్లి కూతురు కోసం వచ్చి.. బొక్కబోర్లా పడ్డ ఫొటోగ్రాఫర్.. నవ్వులే నవ్వులు!