Kasibugga-Stampede (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం

Kasibugga stampede: కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Kasibugga stampede: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శనివారం జరిగిన ఘోర తొక్కిసలాట (Kasibugga stampede) ఘటనా ప్రాంతాన్ని రాష్ట్రమంత్రి నారా లోకేష్ పర్యటించారు. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ఆ తర్వాత హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను కూడా పరామర్శించారు. పలువురు బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన ఘటన చాలా విషాదకరమైనదని ఆయన వ్యాఖ్యానించారు. ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారని, ఎంట్రీ పాయింట్ వద్ద తోపులాట జరిగి 9 మంది చనిపోయారని వెల్లడించారు. మొత్తం 16 మంది గాయపడగా, అందులో ముగ్గురికి ప్రత్యేక జాగ్రత్త అవసరమైందని, మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం పంపించామని చెప్పారు. ఈ గుడిని ఒక భక్తుడు కట్టించాడని, భూమి నుంచి నిర్మాణానికి ఖర్చు అయిన ప్రతిరూపాయిని పాండా అనే వ్యక్తి పెట్టుకున్నారని నారా లోకేష్ వెల్లడించారు. ఆయన వయసు 94 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోకి భక్తులకు వెంకటేశ్వర స్వామి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారని, శనివారం ఆలయానికి వచ్చినవారిలో 90 శాతం మంది మొదటిసారి వెళ్లినవారని, కేవలం 10 శాతం మంది మాత్రమే రెండోసారో, మూడోసారి వచ్చారని ఆయన చెప్పారు. గత నాలుగైదేళ్ల నుంచి గుడిని నిర్మిస్తున్నారని, నాలుగు నెలలక్రితమే ప్రతిష్టాపన జరిగిందని చెప్పారు.

Read Also- MLA Kaushik Reddy: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్

ఇంతమంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేని, పోలీసువారికి కూడా ఎలాంటి సమాచారం లేదని నారా లోకేష్ చెప్పారు. ఈ గుడిని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారని, ఆ తర్వాత 3 గంటల బ్రేక్ ఇచ్చి సాయంత్రం ఓపెన్ చేస్తారని లోకేష్ వెల్లడించారు. సుమారుగా 11.30 గంటల సమయంలో దర్శనం చేసుకున్న భక్తులు వెనుదిరగ, ఇదే సమయంలో లోపలికి వెళ్లే భక్తులకు కూడా పోటెత్తారని చెప్పారు. మళ్లీ సాయంత్రం రావాల్సి ఉంటుందేమోనన్న ఆలోచనతో బయట ఉన్నవారు ఎంట్రీపాయింట్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారని వివరించారు. ఈ సమయంలో మంత్రి లోకేష్ వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, స్థానిక ఎమ్మెల్యే, పలువురు టీడీపీ నాయకులు ఉన్నాయి.

Read Also- Yadadri Collector: జిల్లా కలెక్టర్‌ చిత్రపటానికి పాలాభిషేకం.. ఆయన చేసిన మంచిపని ఏంటో తెలుసా?

కాగా, ఈ ఘటనలో మొత్తం 9 మంది చనిపోగా, మృతదేహాలు అన్నింటికీ పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం డెడ్‌బాడీలను బాధిత కుటుంబలకు అప్పగించారు. గాయపడిన 13 మందికి చికిత్స కొనసాగుతోంది. ఆరోగ్యం విషమంగా ఉన్నవారికి శ్రీకాకుళం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడ్డవారికి పలాస హాస్పిటల్‌లోనే చికిత్స కొనసాగుతోంది.

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?