KTR: జూబ్లీహిల్స్‌లో కారుకు బుల్డోజర్‌కు మధ్యపోటీ.. కేటీఆర్
KTR ( image cedit: swtcha reporter)
Political News

KTR: జూబ్లీహిల్స్‌లో కారుకు బుల్డోజర్‌కు మధ్యపోటీ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: బుల్‌డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రజలకు పిలుపు నిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బుల్డోజర్‌, కారుకు మధ్య పోటీ నడుస్తోందన్నారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం పలువురు ఎంఐఎం నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తాం. యువతులకు స్కూటీలు ఇస్తాం. వృద్ధులకు నాలుగు వేల పెన్షన్‌ ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.

 Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పాలి.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలి

రెండేళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని.. అయితే.. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని పిలుపు నిచ్చారు. పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్జోజర్‌ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలకు మేం అండగా ఉంటాం

అయితే వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ఆయన ధైర్యం చెప్పారు. హామీలపై వారిని నిలదీయాల్సిన టైమ్‌ వచ్చిందన్నారు. ప్రజలు భయపడతారని వాళ్లు అనుకుంటున్నారని గల్లా పట్టి మోసం చేసిన వాళ్లను నిలదీసే దమ్మున్న గడ్డ ఇది అని పేర్కొన్నారు. ప్రజలకు మేం అండగా ఉంటాం.. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీరు ధైర్యంగా పనిచేయండి.. ఎవరైనా బెదిరిస్తే వారి సంగతి తర్వాత చూద్దాం అన్నారు. మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, నాయకులు కిశోర్ గౌడ్, రామచంద్రునాయక్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులున్నారు.

 Also ReadKTR: రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా పాలిస్తోంది.. పోలీసులు ఏం పీకుతున్నారు.. కేటీఆర్ వైల్డ్ ఫైర్!

Just In

01

Thummala Nageswara Rao: పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

GHMC Ward Delimitation: పునర్విభజనపై అభ్యంతరాల స్వీకరణకు..హైకోర్టు ఆదేశాలతో డీలిమిటేషన్ గడువు!

Asim Munir – Trump: ఆసీం మునీర్‌కు అగ్నిపరీక్ష.. పాకిస్థాన్‌ తర్జన భర్జన.. ట్రంప్ భలే ఇరికించారే!

Gold Rates: అతి భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్!

Alleti Maheshwar Reddy: స్పీకర్ తీర్పు రాజ్యాంగ ఉల్లంఘనే.. ఏడాదిన్నర కాలయాపన ఎందుకు?