Suryapet District: తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్ వేధింపులకు తాళలేక ఓ మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఉదయం చోటుచేసుకుంది. మృతురాలి కుమార్తెలు, కుమారుడు సరిత, అనిత, మహేష్ లు తెలిపిన వివరాల ప్రకారం..గత 15 రోజుల క్రితం తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన సోమ నర్సమ్మ (50) బావ మల్లయ్య ఇంటిలో బంగారం పోయిందనే నెపంతో సోమ నర్సమ్మ పై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో వెంపటి గ్రామానికి చెందిన కొంతమంది పెద్దమనుషులు, మల్లయ్య కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పలుమార్లు ఫిర్యాదు చేయగా, రాత్రి 8 గంటల వరకు తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో సోమనర్సమ్మను ఉంచారు.
Also Read:Suryapet District: సీఎంఆర్‌లో సూర్యాపేట జిల్లా వెనుకంజ.. కారణం అదేనా!
సోమనర్సమ్మ మృతిపై పూర్తిస్థాయి నిర్లక్ష్యం
తుంగతుర్తి ఎస్సై క్రాంతికుమార్ కనీసం మహిల అని కూడా చూడకుండా, వేధింపులకు గురిచేసి, నిన్ను జైలుకు పంపుతాం, నీవే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేశారన్నారు. దీనితో ఆవేదనకు గురైన సోమ నర్సమ్మ రాత్రికి రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.జరిగిన సంఘటనపై ఎస్ఐ ని వివరణ అడగగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. సోమనర్సమ్మ మృతిపై పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహించిన ఎస్సై క్రాంతి కుమార్ పై పోలీస్ ఉన్నత అధికారులు, జిల్లా పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Suryapet Student Died: బీటెక్ హాస్టల్ లో షాకింగ్ ఘటన.. రక్తపు మడుగులో విద్యార్థిని.. ఏం జరిగింది?
