Khammam Crime ( image credit: swetcha reporter)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Khammam Crime: సీపీఎం నేత గొంతు కోసి చంపిన దుండగులు.. ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన

Khammam Crime: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఉదయం సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు ను అత్యంత పాశవికంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సామినేని రామారావు రోజూ మాదిరి గానే  మార్నింగ్ వాక్ కు వెళ్లారు. ఆ సమయంలో మార్గ మధ్యంలో ఆయన్ను అడ్డగించిన దుండగులు పదునైన ఆయుధంతో గొంతుకోసి హతమార్చారు.

 Also Read: Medchal Crime: హత్యకు దారి తీసిన అప్పు వివాదం.. కత్తులతో దారుణం

హత్యకు గల కారణాలపై ఆరా

రక్తపు మడుగులో పడివున్న ఆయన్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరు కున్నారు. పరిసరాలను పరిశీలించి, సాక్ష్యాధారా లను సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారం భించారు. ఈ ఘటనతో పాతర్లపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 Also Readkhammam crime: భర్తను చంపేందుకు సుపారీ.. అడ్వాన్స్ కూడా.. ఎంతంటే!

Just In

01

Ponnam Prabhakar: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు

Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్?

Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు

Gadwal District: గట్టు ఎత్తిపోతల పూర్తయ్యేనా? 1.32 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంపెంపుకు అంగీకారం!

Mass Jathara Review: రవితేజ ‘మాస్ జాతర’ ప్రేక్షకులను మెప్పించిందా?