SEBI Recruitment 2025 : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. (SEBI) అనేది భారతదేశంలోని సెక్యూరిటీ మార్కెట్‌ను నియంత్రించే ప్రధాన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. SEBI లక్ష్యం పెట్టుబడిదారుల హక్కులను రక్షించడం, సెక్యూరిటీ మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించడం. నియంత్రణలు అమలు చేయడం. SEBI గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్ట్ అనేది ఈ సంస్థలో ప్రతిష్టాత్మకమైన ఎంట్రీ-లెవల్ ఉద్యోగం. ఇక్కడ జనరల్, లీగల్, ఐటీ, రీసెర్చ్ వంటి వివిధ స్ట్రీమ్‌లలో పని చేస్తారు.
ఈ సంవత్సరం SEBI గ్రేడ్ A రిక్రూట్‌మెంట్ వివరాలు
ఈ సంవత్సరం వివిధ స్ట్రీమ్‌లలో SEBI గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల కోసం మొత్తం 110 ఖాళీలు ప్రకటించారు. SEBI గ్రేడ్ A 2025 నోటిఫికేషన్ PDFను అక్టోబర్ 30, 2025న విడుదల చేశారు. ఆసక్తి గల గ్రాడ్యుయేట్లు, పోస్ట్-గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30, 2025 నుంచి https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది.
SEBI గ్రేడ్ A నోటిఫికేషన్ 2025 విడుదల
వివరణాత్మక SEBI గ్రేడ్ A నోటిఫికేషన్ 2025 PDFను అక్టోబర్ 30, 2025న https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌తో పాటు అందుబాటులో ఉంచారు. ఈ పోస్ట్‌లు అభ్యర్థులకు రూ. 1,84,000 వరకు జీతం పొందే అద్భుతమైన అవకాశం. నోటిఫికేషన్‌లో రిజిస్ట్రేషన్ తేదీలు, విద్యా అర్హతలు, ఖాళీల వివరాలు, జీతం, దరఖాస్తు రుసుము వంటి అన్ని వివరాలు గురించి తెలుసుకుందాం..
సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)
పోస్ట్ పేరు – అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-A)
ఖాళీలు – 110
SEBI గ్రేడ్ A ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు
దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ – అక్టోబర్ 30, 2025
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – 28 నవంబర్ 2025
దరఖాస్తులను ముద్రించడానికి చివరి తేదీ – 13 డిసెంబర్ 2025
ఫేజ్ 1 పరీక్ష తేదీ – 10 జనవరి 2026
ఫేజ్ 2 పరీక్ష తేదీ – 21 ఫిబ్రవరి 2026
