Viral Accident (Image Source: Twitter)
Viral

Viral Accident: ఆ చిన్న రోడ్డు ప్రమాదానికి.. యావత్ దేశమే షాక్.. అంతలా ఏం జరిగిందంటే?

Viral Accident: బెంగళూరులో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఊహించని మలుపు తిరిగింది. ఒక వ్యక్తిని ఓ జంట కారుతో ఢీకొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్టోబర్ 25 రాత్రి నగరంలోని పుట్టెనహళ్లి ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం.. ప్రతీ ఒక్కరినీ షాక్ గురిచేస్తోంది. కారు సైడ్ మిర్రర్ కు తగిలాడన్న కారణంతో బైకర్ ను ఓ జంట వెంటాడి హత్య చేయడం సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

మృతుడు దర్శన్.. స్నేహితుడు వరుణ్ తో కలిసి మోటార్ సైకిల్ పై ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో మనోజ్ కుమార్, అతడి భార్య ఆరతి శర్మ ప్రయాణిస్తున్న కారు అద్దాన్ని వారు బలంగా తగిలారు. అనంతరం బైక్ ను ఆపకుండా ముందుకు వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన మనోజ్ కుమార్ జంట.. కారులో దర్శన్ వెళ్తున్న బైక్ ను వెంటాడింది. దాదాపు 2 కి.మీ వరకూ బైక్ ను వెంబడించింది. యూటర్న్ తీసుకొని మరి వచ్చి వరుణ్ బైక్ ను వెనుకనుంచి బలంగా కారుతో ఢీకొట్టింది. దీంతో బైక్ పై నుంచి దర్శన్, వరుణ్ ఇద్దరు కిందపడిపోయారు. దర్శన్ కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడు వరుణ్ గాయాలతో బయటపడ్డాడు.

యూటర్న్ తీసుకొని మరి..

తొలుత సాధారణ ప్రమాదంగా భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కారులోని మనోజ్ కుమార్ దంపతులు.. బైక్ ను ఢీకొట్టే ప్రయత్నంలో తొలుత విఫలమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకొని వచ్చి దర్శన్ బైక్ ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఘటన అనంతరం వారు కారు ఆపకుండా వెళ్లిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. కొద్దిసేపటి తర్వాత ముఖానికి మాస్కులు పెట్టుకొని ప్రమాద స్థలానికి వచ్చిన ఆ జంట.. విరిగిపడ్డ కారు భాగాలను సేకరించి అక్కడ నుంచి వెళ్లిపోయింది.

Also Read: Nuclear Weapons Test: ట్రంప్ మరో సంచలనం.. 30 ఏళ్ల తర్వాత అణు పరీక్షలు.. అమెరికా వ్యూహాం ఏంటి?

హత్యారోపణల కింద కేసు నమోదు

దీంతో తొలుత సాధారణ యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. తర్వాత దానిని హత్య కేసుగా మార్చారు. భర్త మనోజ్ కుమార్, భార్య ఆరతి శర్మపై హత్యారోపణల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. షాకింగ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న భార్య, భర్తలను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

Also Read: Warangal Montha Cyclone: ఓరుగల్లును ముంచిన మొంథా తుఫాన్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం!

Just In

01

Medak Bribe Case: రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాన్స్‌కో డీఈ..

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?