Gadwal Collector (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Gadwal Collector: విత్తన పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కంపెనీలు సహకరించాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

Gadwal Collector: విత్తన పత్తి పంటకు ధరలు, చెల్లింపు విషయంలో కంపెనీలు ఒప్పందం చేసుకున్న ప్రకారం వ్యవహరించి, రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం.సంతోష్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లాలో విత్తన పత్తి సాగు చేస్తున్న రైతులకు ఆయా కంపెనీల పెండింగ్ చెల్లింపులు, ఒప్పందం విషయంలో ఉన్న సమస్యలపై కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది జిల్లాలో సుమారు 46 వేల ఎకరాల్లో 36,430 మంది రైతులు విత్తన పత్తి సాగు చేసినట్లు చెప్పారు. వీరికి దాదాపు రూ.261 కోట్ల బకాయిలు ఉన్నందున సాధ్యమైనంత తొందరగా చెల్లించేలా కంపెనీల ప్రతినిధులు తమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాలి అన్నారు.

Also Read: Gadwal Collector: పునరావాస కేంద్రంలో పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలి : కలెక్టర్ బి.యం సంతోష్

30  ఏళ్లుగా విత్తన పత్తి పంటకు ప్రఖ్యాతి

విత్తనపత్తి సాగు విషయంలో 2025 – 26 సంవత్సరానికి ఇంకా ఒప్పందం చేసుకోని కంపెనీలు నవంబర్ 10 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గత 30 ఏళ్లుగా విత్తన పత్తి పంటకు ప్రఖ్యాతిగాంచిన జోగులాంబ గద్వాల జిల్లాలో కొంతకాలంగా ఒప్పందం, చెల్లింపుల విషయంలో సమస్యలు వస్తుండడం సరికాదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కంపెనీలు సహకరించకుంటే వారి లైసెన్స్ రద్దు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్గనైజర్లు వివిధ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. చెల్లింపులు, ఒప్పందం విషయంలో ఉన్న సమస్యలను ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ఏళ్ల తరబడిగా బకాయిలు చెల్లించడం లేదు

కొన్ని కంపెనీలు ఏళ్ల తరబడిగా బకాయిలు చెల్లించడం లేదని, ఫలితంగా చిన్న ఆర్గనైజర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. నాలుగైదు కంపెనీలు చేసుకున్న ఒప్పందం కంటే తక్కువ ధరలు చెల్లిస్తున్నాయని, సకాలంలో చెల్లింపులు చేయడం లేదని విమర్శించారు. అనంతరం ఆయా కంపెనీల వారీగా గత సీజన్లో ఉన్న బకాయిలు, సాగు చేసిన విస్తీర్ణం వివరాలు, ఒప్పందం చేసుకోవడంలో ఉన్న సమస్యల గురించి క్షుణ్ణంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి వ్యవసాయ అధికారి జగ్గు నాయక్, ఏడిఏ సంగీతలక్ష్మి, సీడ్ ఆర్గనైజర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు, సీడ్ ఆర్గనైజర్లు, పలువులు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Gadwal Collectorate: బుక్కెడు బువ్వ కోసం వృద్దురాలు ఆరాటం.. జన్మనిచ్చిన తల్లి గురువులకు భారమా?

Just In

01

Tamannaah Bhatia: బాహుబలి ఎపిక్‌లో మళ్లీ తమన్నా సీన్స్ కట్?

Nalgonda District: నల్గొండ శిశు విక్రయంలో.. వెలుగులోకి సంచలన నిజాలు!

Warangal Montha Cyclone: ఓరుగల్లును ముంచిన మొంథా తుఫాన్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం!

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన రేట్స్?

Montha Cyclone: నిండా ముంచిన మొంథా.. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం