Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటి దొడ్డి మండల పోలీస్ స్టేషన్లోని అధికారులు, సిబ్బంది అక్రమ సంపాదనకు పరితపిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు నగదు రాబట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. నిత్యం ఆ స్టేషన్ పరిధిలో జరిగే వ్యవహారాలపై ఫోకస్ చేస్తూ సివిల్(Civil), రేషన్ దందా(Ration racket)లో పంచాయతీలు నిర్వహిస్తూ అందిన కాడికి దండుకునే పనిలో ఆ పోలీస్ స్టేషన్ ఎస్సై(SI) తో పాటు సిబ్బంది తల మునుకలై ఉన్నారు. ఎన్నో ఉదంతాలు ఆ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్నా.. కొన్ని ఉదంతాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. తాజాగా పాగుంట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు(Pagunta Venkateswara Swamy Brahmotsavam) జరగగా సమీపంలో వేసిన చిరు అంగళ్ళ నుంచి సైతం వివిధ శాఖల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు.

ఇసుక అక్రమ రవాణా..

ఈ అక్రమ వసుళ్లపై జిల్లా పోలీస్ బాస్ కు ఫిర్యాదులు సైతం చేశారు. ఈ నేపథ్యంలో ఆ మండల పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ కానిస్టేబుల్ ను జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏఆర్(AR) కు అటాచ్ చేశారు. ముఖ్యంగా భూ పంచాయతీలలో ఎస్సై ఏకపక్షంగా వ్యవహరించడంపై బాధితుల నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. రాయచూర్(Raichur) నుంచి ఇసుక అక్రమ రవాణా(Sand smuggling) తో పాటు జిల్లా నుంచి రాయచూర్ కు సరిహద్దు మండలం కావడంతో అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఆ మండల పోలీస్ స్టేషన్ పై తరచుగా ఆరోపణలు వస్తుండగా.. కొన్నిసార్లు ఎస్సై(SI) పై జిల్లా ఎస్పీ(SP) బాస్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి.

Als Read: Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్

చిరు వ్యాపారులను సైతం వదలని వైనం

పాగుంట జాతరలో జీవనోపాధి కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలదారుల(Shopkeepers)ను సైతం వదలలేదు. ప్రతి దుకాణం నుంచి అక్రమంగా సిబ్బంది వసూలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మండల పి.ఎస్ కానిస్టేబుల్ ను ఏ. ఆర్ కు అటాచ్ చేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో కలకలం

జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా కేటి దొడ్డి(Keti Dhoddi) మండలం పాగుంట వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా అక్రమ వసూళ్లలో ఓ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవడంతో మనస్థాపం చెందిన ఆ కానిస్టేబుల్ ఈ వ్యవహారంలో ఎస్సై(SI) సైతం ఉన్నారని తనని ఒక్కడిని బలిపశువును చేశారని, తన బదిలీని ఆ ఎస్ఐ(SI) ఆపకపోతే పోలీస్ స్టేషన్లో జరిగే అక్రమ వసుల్ల చిట్టాను మొత్తం బయట పెడతానని, తిరిగి అదే పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వకపోతే ఆత్మహత్య(Suicide) చేసుకుంటానని తన తల్లిదండ్రులకు తెలుపుతూ ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి స్థానిక సోషల్ మీడియా గ్రూపులో పెట్టాడు. దీంతో బెంబేలెత్తిన ఆ గ్రూప్ సిబ్బంది.. వ్యవహారం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరడంతో జిల్లా ఎస్పి శ్రీనివాసరావు(SP Srinivasa Rao) ఎస్సై పై విచారణ జరిపే అవకాశం ఉంది.

Also Read: Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Just In

01

Raju Weds Rambai: ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబి’.. ఆ జాబితాలోకి చేరే సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’

Murmu in Rafale: రాష్ట్రపతి ముర్ము బిగ్ సర్‌ప్రైజ్.. ఈ ఫొటోలోని శివంగిని చూస్తే పాకిస్థాన్ అవాక్కే!

Maoists: తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నల్లమలలో మావోయిస్టుల సమావేశం!

Chhattisgarh: మావోయిస్టులకు భారీ షాక్.. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్రకుమార్ ఎదుట 51 మంది సరెండర్

Bigg Boss Telugu 9: రీ ఎంట్రీలో షాకింగ్ ట్విస్ట్.. భరణికి ఏమైంది?