CM Revanth Reddy (image credit: twitter)
Politics

CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కమ్మ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను కమ్మ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అమీర్ పేట్ మైత్రీ వనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు కమ్మ సంఘాలు ప్రకటించాయి.

ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తాం

నవీన్ ను భారీ మెజార్టీ తో గెలిపించండిజూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..కమ్మ సామాజిక వర్గంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని గుర్తు చేశారు. తప్పకుండా ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తామన్నారు. మైత్రీ వనంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతోపాటు కమ్మ సంఘాల నాయకుల విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఇంచార్జ్ బండి రమేశ్, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, కమ్మ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Also  Read: CM Revanth Reddy: సంక్షేమ నిధికి రూ.10 కోట్లు.. సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు

తుమ్మిడిహట్టి నుంచి 80 టీఎంపీలు తరలిద్దాం.. సీఎం రేవంత్ రెడ్డి

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ యారేజీల మరమ్మత్తులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఇందుకు సంబంధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. మంగళవారం ఆయన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ మీటింగ్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్ రాజ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారిగా విశ్లేషణలు జరగాలని స్పష్టంగా చెప్పారు.

డ్యామ్‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌లను తయారు చేయాలి

కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవల్యూషన్’ కు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఇటీవల రాసిన లేఖపై ముఖ్యమంత్రి , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, అధికారుల బృందం చర్చించారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి లేఖలో ప్రస్తావించిన అంశాలను అధికారులకు సీఎం వివరించారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల వారిగా సమగ్రమైన వివరాలతో విశ్లేషణలు జరగాలని, రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపైనా స్టేటస్ రిపోర్ట్‌లను తయారు చేయాలని ఆదేశాలిచ్చారు.ప్రాజెక్టుల వారీగా రూపొందించే పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తానని సీఎం ప్రకటించారు.

ఈ ప్రణాళికలు సిద్ధం కావాలి

ఇక తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఈ ప్రణాళికలు సిద్ధం కావాలని చెప్పారు. ఇందుకు పాత పనులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా అంచనాలను తయారు చేయాలని సూచించారు. సుందిళ్లను మరమ్మత్తు చేసి వినియోగంలోకి తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి కోరారు.

Also  ReadCM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Just In

01

Hydraa: 435 ఏళ్ల‌ చ‌రిత్ర కలిగిన పాత‌బ‌స్తీలోని చెరువుకు హైడ్రా పున‌రుద్ధ‌ర‌ణ‌

Maoists Killed: చత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు

Singareni Collieries: సింగరేణిలో మెగా జాబ్ మేళా.. 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

Aarogyasri Scheme: పేద గుండెలకు అండగా ఆరోగ్యశ్రీ.. ఐదేళ్లలో వెయ్యి కోట్లకు పైగా ఖర్చు

Montha Cyclone: మొంథా సైక్లోన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!