Ashwini-Vaishnaw (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు రైల్వే మంత్రి కీలక ఆదేశాలు

Cyclone Montha: తెలుగు రాష్ట్రాల్లో వార్ రూంలు ఏర్పాటు చేయండి

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సూచనలు
దక్షిణమధ్య రైల్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మొంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలోనూ డివిజనల్ వార్ రూంలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదేశించారు. మంగళవారం దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన సామగ్రి, యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి ప్రయాణికులకు అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని, అత్యవసర వేళల్లో సత్వరం స్పందించాలని ఆదేశించారు.

Read Also- Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల

అధికారులతో జీఎం సమీక్ష

మొంథా తుపాను సంసిద్ధతపై మంగళవారం సికింద్రాబాద్‌లోని ‘రైల్ నిలయం’ నుంచి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణీకులకు ఉత్తమ భద్రతను కల్పించే ప్రయత్నాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. తుపాను విజయవాడ, గుంటూరు డివిజన్ల అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను మార్గాన్ని నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Read Also- Cyclone Montha Live Updates: తీరాన్ని తాకిన మొంథా తుపాను.. ఏపీలో అల్లకల్లోల పరిస్థితులు

రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలతో సన్నిహితంగా వ్యవహరించి, ట్రాక్ , రైలు కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి ఈ విభాగంలో రైల్వే ప్రభావిత ట్యాంకుల స్థానాన్ని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రభావితమయ్యే విభాగాలలో ట్రాక్‌లపై పెట్రోలింగ్ ఉండేలా చూడాలని ఆదేశించారు. వాస్తవ సమయ సమాచారాన్ని పొందడానికి అన్ని వంతెనలు, ప్రదేశాలలో స్టేషనరీ వాచ్‌మెన్‌లను కూడా నియమించాలన్నారు. అనంతరం ‘ఎంప్లాయీ ఆఫ్ ది మంత్’ భద్రతా అవార్డులను ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, డీఆర్‌ఏంలు పాల్గొన్నారు.

Just In

01

Mahabubabad Cyclone Montha: మహబూబాబాద్ జిల్లాలో మొంథా బీభత్సం.. నిలిచిపోయిన పలు రైళ్లు.. రంగంలోకి జిల్లా ఎస్పీ!

TG CM – Cyclone Montha: తెలంగాణపై మెుంథా ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Government Lands: త్వరలో ప్రభుత్వానికి అందనున్న నిషేధిత భూముల జాబితా..!

Jubilee Hills Bypoll: మీకు అభివృద్ధి కావాలా.. అబద్ధాలు కావాలా.. జూబ్లీహిల్స్ ఓటర్లకు పొన్నం అల్టిమేటం!

Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!