Thummala Nageswara Rao: పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి
Thummala Nageswara Rao( image credit: swetcha reporter)
Telangana News

Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల

Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ రైతులతో మంత్రి మాట్లాడారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తుఫాన్ తో చేతికందిన పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని కోరారు. మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికి పత్తి కొనుగోళ్లు జరపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

Also Read: Thummala Nageswara Rao: ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీ కోర్సులు.. యువతకు కొత్త అవకాశాలు

1623 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశాం

రాష్ట్ర వ్యాప్తంగా 72 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంబించామని, 784 మంది రైతులకు చెందిన 1623 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశామన్నారు. పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేశారని, ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి దిగుబడులు తగ్గడం ,మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం విషయంలో 12 శాతం పైగా ఉన్న పత్తినీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలనికోరారు.

పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాలో పర్యటించి ఏ ఈవో లు మార్కెట్ సెక్రటరీలు ,జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారన్నారు. రైతులు యాప్ లో నమోదు చేసుకుంటే పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపారు. రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 కి కాల్ చేయవచ్చని ప్రకటించారు. బుధవారం నుంచి సోయాబీన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లో మొక్కజొన్న జొన్నలు చేర్చాలని సోయా పై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Also Read: Thummala Nageswara Rao: పత్తికొనుగోళ్లపై పర్యవేక్షణ చేయాలి.. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..