Bhatti Vikramarka ( image credit: swetcha reporter)
ఖమ్మం, నార్త్ తెలంగాణ

Bhatti Vikramarka: విద్యుత్ ప్రమాదాలకు చెక్.. రూ.27.76 కోట్లతో ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం లో రూ. 27.76 కోట్ల నిధులతో 3.5 కిలోమీటర్ల 33కె.వి లైన్, 17.3 కిలోమీటర్లు 11 కెవి లైన్, 15 కిలోమీటర్ల LT లైన్ పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శంకుస్థాపనలు చేశారు. అండర్ గ్రౌండ్ కేబుల్ తో భారీ వర్షాలు, తుఫాన్ సమయంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా 24 * 7 విద్యుత్ సరఫరా అందించేలా పనిచేస్తుంది. రోడ్ల పక్కన చెట్లు విరివిగా పెంచుకోవచ్చు. దీంతో కాలుష్యం వివరించడానికి దోహదపడుతుంది. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. రహదారులపై విద్యుత్ స్తంభాల ద్వారా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తే తరచూ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ తో వైర్లు వేలాడకుండా ఉంటుంది ఎలాంటి ప్రమాదాలు కూడా సంభవించవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

 Also ReadBhatti Vikramarka:హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కేబుల్ ప్రతిపాదిత పనుల వివరాలు

మధిర సబ్స్టేషన్ నుండి ఆత్కూర్ రింగ్ రోడ్డు (జిలుగు మాడు), మధిర సబ్స్టేషన్ నుండి విజయవాడ రోడ్డు లోని హెచ్పి గ్యాస్ గోడౌన్ వరకు రెండు వైపులా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ పనులను చేపట్టనున్నారు. వైయస్సార్ విగ్రహం నుండి అంబర్పేట చెరువు వరకు ప్రస్తుత 11 కెవి ఎల్ ఓవర్ హెడ్ లైన్లో అండర్ గ్రౌండ్ టేబుల్ విధానంలో మార్చేందుకు ప్రతిపాదించారు. నందిగామ బైపాస్ రోడ్డు హెచ్ పి పెట్రోల్ బంక్ నుండి డంపింగ్ యార్డ్ వరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బైపాస్ లో తరచుగా సంభవించే లైన్ అంతరాయాలను నివారించుటతో పాటు భవిష్యత్తులో లోడ్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

 Also Read: Bhatti Vikramarka: మహిళలకు కీలక సందేశం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?